home page

రాజీపడకుండా కెసిఆర్ అడుగులు

తమిళసైకి పుట్టినరోజు శుభాకాంక్షలుతో కెసిఆర్ 

 | 
Kcr

తమిళసై రియాలిటీ షోలో ఏం చేయాలి?

Telangana: ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య దూరం తగ్గుతోందా? గవర్నర్‌కు, సీఎంకు మధ్య ముదిరిన కోల్డ్‌వార్‌ చల్లబడిందా? రాజీ‌ అవుతోందా? అన్న ప్రశ్నలు జనాలు మస్తిష్కంలో ఉన్నాయి.భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగ్గాలని అనుకుంటున్నారా? గవర్నర్‌ తమిళిసై పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ పంపిన శుభాకాంక్షల వర్తమానం దేనికి సంకేతం? రాబోయే రోజుల్లో రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య సఖ్యత చేకూరుతుందా? ఇదంతా రాజకీయంగా అనుసరిస్తున్న ఎత్తుగడలా? భవిష్యత్‌ వ్యూహాల ఉపాయాలా? అసలేం జరుగుతోంది?
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎత్తుగడలు ఎవ్వరికీ ఓ పట్టాన అర్థం కావు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరిని అక్కున చేర్చుకుంటారో, ఇంకెవరిని కాదనుకుంటారో తెలుసుకోవడం కష్టమంటారు. సరిగ్గా అలాంటి ఓ నిర్ణయమే తీసుకున్నారాయన.
గత కొన్ని నెలల నుంచి ప్రగతిభవన్‌ వర్సెస్‌ రాజ్‌భవన్‌ అన్నట్టుగా ఉంది పరిస్థితి. గవర్నరమెంట్‌తో గవర్నర్‌ సై అంటే సై అంటూ రాజకీయ వేడిని రగులుస్తున్నారు. అలాంటి సిచ్చివేషన్‌లో సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసైకి సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దేవుని ఆశీస్సులతో మరెన్నో ఏళ్లు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
గత కొంతకాలంగా గవర్నర్‌కు సరైన ప్రొటోకాల్ ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. అంతెందుకు ఇది కడుపులో పెట్టుకోవడం ఎందుకనుకున్నారో ఏమో.. ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కి ఏకంగా పీఎం మోడీ, హోంమంత్రి అమిత్‌షాను కలసి వివరించారు. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా మీడియా ముందే వివరించారు. ఇంతటి గ్యాప్‌ క్రియేట్‌ అయిన తర్వాతే ఈ ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ తమిళిసై పుట్టినరోజున శుభాకాంక్షలు ట్వీట్‌ చేసిన కేసీఆర్‌ దేవుని ఆశీస్సులతో మరెన్నో ఏళ్లు ఆమె ప్రజలకు సేవ చేయాల, ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
కొద్ది నెలల కిందట ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. వీటిపై గులాబీ దళం నుంచి కూడా రీసౌండ్ గట్టిగానే వచ్చింది. గవర్నర్‌ కామెంట్లపై స్పందించిన మంత్రులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్‌, గవర్నర్ తమిళిసైకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
జనరల్‌గా కేసీఆర్‌ పెద్దగా గవర్నర్లతో పెట్టుకున్న సందర్భాలు తక్కువ. తమిళిసై గవర్నర్‌గా రాకముందు నరసింహన్‌ తెలంగాణ గవర్నర్‌గా ఉండేవారు. ఈయనతో కేసీఆర్‌ సత్సంబంధాలనే మెయింటైన్‌ చేశారు. కానీ ఎక్కడ చెడిందో ఏమో కానీ తమిళిసైతో డిస్టెన్స్‌ పెరిగింది. కౌశిక్‌రెడ్డిని నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని కేబినెట్‌ చేసిన తీర్మానాన్ని గవర్నర్‌ పక్కనపెట్టారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తుందని చెప్పుకుంటున్నా అది సరైన కారణం కాదన్న చర్చ ఉండింది.
ఇక అప్పటి నుంచి ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య రాకపోకలు తగ్గిపోయాయి. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు కూడా సీఎం కేసీఆర్ దూరంగానే ఉన్నారు. పెద్దగా ఎక్కడా స్పందించింది లేదు. ఆ తర్వాత నుంచి మరింతగా పెరిగిన దూరంతో తనకు ప్రోటోకాల్‌ మర్యాదలను కేసీఆర్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదంటూ తమిళిసై ఫైర్‌ అయ్యారు. కానీ, ఇక్కడే కేసీఆర్‌ మరోలా ఆలోచించారన్న చర్చ జరుగుతోంది. అదేంటంటే గవర్నర్‌తో సంబంధాలు దెబ్బతింటే పరిస్థితి ఎలా ఉంటుందో కేసీఆర్‌లాంటి ఉద్దండ రాజకీయ నాయకుడికి తెలియందేమీ కాదంటారు గులాబీ నేతలు. అందుకే ఆయన అందరికంటే భిన్నంగా ఆలోచించారని, గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని గొప్పగా చెప్పుకుంటున్నారు.
అదేంటో కాస్త డిటైల్డ్‌గా చూద్దాం. తమిళనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసి గవర్నర్‌గా వచ్చిన తమిళిసైకి రాజకీయాలు కొత్తేమీ కాదు. తెరచాటు రాజకీయలకు ఇంకోసారి చాన్స్‌ ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ ఇలా ఆలోచించి ఉంటారన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట. అంతేగాకుండా, తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించలేదు కేసీఆర్‌. ఒకవేళ దాన్నే గనుక చేపట్టాల్సి వస్తే అందుకు గవర్నర్‌ ఆమోదం తప్పనిసరి. ఇంత గ్యాప్‌ పెరిగిన తర్వాత ఒక్కసారిగా రాజ్‌భవన్‌కు వెళ్లడం, గవర్నర్‌ ఆమోదాన్ని కోరడం కాస్త ఇబ్బంది అనుకునే ఇలా బర్త్‌ డే విషెస్‌తో స్టార్ట్ చేసి ఉంటారన్న టాక్‌ నడుస్తోంది. అదీగాక, ఈటల రాజేందర్‌ రాజీనామా తర్వాత సీను పూర్తిగా మారిపోయింది. రాజకీయంగా వేడి పెరిగింది. ఆ వేడిని ఈ శుభాకాంక్షలు కాస్త చల్లారిచ్చే అవకాశం ఉంటుందని కూడా ఆయన ఆలోచించి ఉంటారన్న టాక్‌ నడుస్తోంది.
ఇదిలా ఉంటే, తెలంగాణలో ముందస్తు అంటూ కోయిల ముందే కూసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దానికి అనుమతి కావాలన్నా రాజ్‌భవన్‌ గడప తొక్కాల్సిందే. అలాంటిదేమీ లేకుంటే, రాజ్‌భవన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోయినా ముందస్తు ఎన్నికల కోసమైతే కంపల్సరీగా వెళ్లాల్సిందే. అలాంటి ఒకరోజు అలా వస్తే తమిళిసై ముందుకు వెళ్లాల్సి వస్తే ఇబ్బంది ఉండకూడదనే ఇలా విషెస్‌ చెప్పి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, కేసీఆర్‌కు ఇదేమీ కొత్తకాదంటున్నారు గులాబీ నేతలు. శాసనసభ్యులైనా, శాసనమండలి సభ్యులైనా, ఎంపీలు అయినా అలా ఏ పార్టీకి చెందిన వాళ్లకైనా ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కేసీఆర్‌కు అలవాటని టీఆర్ఎస్‌ నేతలు అంటున్నారు. తనకు రాజకీయంగా బద్ధశత్రువులైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా చెప్పిన రోజులు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా చాణక్య రాజకీయ నీతిని చక్కబెట్టే కేసీఆర్‌ తమిళిసై విషయంలో తీసుకున్న నిర్ణయం వెనుక వ్యూహమే ఉందో, ఉపాయమే ఉందో చూడాలి.