Venkaiah Naidu blunder Tweet with Preamble before amendment

ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య ఖాతాలో భారీ త‌ప్పిదం ఇది

అనేక అంశాల‌పై ప‌ట్టున్న నేత‌గా, సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ అనే గుర్తింపు ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తప్పులో కాలేశారు. అది కూడా ఏదో చిన్న త‌ప్పిదం అనే రీతిలో కాకుండా ఆయ‌న ఉన్న అత్యున్న‌త ప‌ద‌వికి కార‌ణ‌మైన అంశం విష‌యంలో ఆయ‌న భారీ త‌ప్పిదానికి కార‌ణ‌మైంద‌ని అంటున్నారు. రాజ్యాంగ దినోత్సవం నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఉప రాష్ట్రపతి అధికారిక ట్విటర్‌లో ఆయన పోస్ట్ చేసిన ఫొటో ఈ పొరపాటుకు కారణమైంది. శుభాకాంక్షలు చెబుతూ ఆయన రాజ్యాంగ పీఠికకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. అయితే అది సవరణకు ముందు ఉన్న పీఠిక. అందులో సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు లేవు. ఇది 1949లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి పీఠికకు సంబంధించిన ఫొటో.

సాక్షాత్తు ఉప‌రాష్ట్రప‌తి ఇలా భారీ త‌ప్పిదంతో చేసిన ట్వీట్ కొద్ది సేప‌ట్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో ఈ ట్వీట్ చేసిన సుమారు 11 గంట‌ల త‌ర్వాత‌ ఈ పొర‌పాటును గ్ర‌హించి దానిని తొల‌గించారు. నిజానికి ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చేసి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను కొత్తగా చేర్చారు. అత్యంత వివాదాస్పద రాజ్యంగ సవరణల్లో దీన్నీ ఒకటిగా పరిగణిస్తారు. ఈ సవరణ ద్వారానే దేశ పౌరుల ప్రాథమిక విధులను కూడా కొత్తగా చేర్చారు. పైగా ఈ సవరణ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కవ అధికారాలను ఇచ్చింది. ఇంత‌టి కీల‌క‌మైన అంశాన్ని ట్వీట్ చేయ‌డంలో ఉప‌రాష్ట్రప‌తి బృందం త‌ప్పిదానికి పాల్ప‌డింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.