‘RRR’ కథేంటో వెల్లడించిన రాజమౌళి!

‘RRR’ కథేంటో వెల్లడించిన రాజమౌళి!

దర్శకధీరుడు రాజమౌళి తాను తెరకెక్కిస్తున్న ‘RRR’పై ఉన్న అనుమానాలన్నింటికీ చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన తన సినిమాలోని హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఆడియన్స్ సినిమాకు వచ్చే ముందు ఆ సినిమాలో ఎలాంటి కథ చూడబోతున్నాం? ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా ఇవ్వబోతోంది? ఆ అంచనాలను పర్‌ఫెక్ట్‌గా ఇవ్వగలగాలి. ఈ సినిమా కథేంటో ముందే చెప్పబోతున్నా. సాధారణంగా సినిమా మొదలు పెట్టకముందే చేస్తాం కానీ కొన్ని కారణాల వల్ల అది చేయలేకపోయా. కాబట్టి ఈ రోజు చెబుతున్నా.

అసలు విషయానికి వస్తే.. 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఇంగ్లీషే కాదు పురాణాలూ చదివారు. యుక్త వయసులో ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రెండు సంవత్సరాలు లేరు. తిరిగి వచ్చాక స్వాతంత్ర్య పోరాటం మొదలు పెట్టారు. ఆయన వచ్చాక జరిగిందంతా మనకు తెలిసిందే. యుక్త వయసులోనే బ్రిటీషర్స్ చేతిలో మరణించారు. 1901లో ఆదిలాబాద్‌లో కొమరం భీం పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఉండగానే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆయన నిరక్షరాస్యుడిగా వెళ్లి అక్షరాస్యుడిగా తిరిగొచ్చారు. ఆయన కూడా బ్రిటీషర్స్ చేతిలో చనిపోయారు.

వీరిద్దరి కథ చదువుంటే ఒకేలా అనిపించింది. ఆ ఇద్దరు మహావీరులు.. ఒకరికొకరు తెలియనివాళ్లు. ఒకే సమయంలో పుట్టడం.. ఒకే సమయంలో ఇల్లు వదిలి వెళ్లిపోవడం.. తిరిగొచ్చాక ఒకే విధంగా ఫైట్ చేయడమనేది నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. అయితే ఆ ఇద్దరు మహా వీరులు ఒకవేళ కలిసుంటే.. ఒకరికొకరు స్ఫూర్తిగా నిలిస్తే.. తరువాతి కాలంలో వారిద్దరూ స్నేహంతో బ్రిటీషర్స్‌పై పోరాడి ఉంటే.. ఎలా ఉంటుంది? అనేదే మా కథ. ఇది ఒక ఫిక్షనరీ స్టోరీ. ఈ సినిమా కూడా బిగ్ ప్లాట్‌ఫాం మీదే ఉంటుంది. మేము చాలా రీసెర్చ్ చేశాం. దీనికోసమే చాలా సమయం పట్టింది’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.