Narendra Modi, ISRO, Kumaraswamy, Karnataka, sensational comments

మోదీ కాలుపెట్టారు… చంద్రయాన్-2 నాశనమైంది: కుమారస్వామి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణంగానే చంద్రయాన్-2లో వైఫల్యం చోటుచేసుకుందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. బెంగళూరు ఇస్రో కేంద్రంలో మోదీ కాలుపెట్టిన వేళా విశేషం కారణంగా సైంటిస్టులను శని పట్టుకుందని అన్నారు.

చంద్రయాన్-2 ఘనత తనదేనని చెప్పుకోవడానికే మోదీ బెంగళూరు వచ్చారని కుమారస్వామి ఆరోపించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు 12 ఏళ్లు ఎంతో కృషి చేశారని, మోదీ కారణంగా అంతా నాశనం అయిందని తెలిపారు. మైసూరులో జరిగిన ఓ సభలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags: Narendra Modi, ISRO, Kumaraswamy, Karnataka, sensational comments

Leave a Reply