బాలీవుడ్ లో అనిల్ కపూర్ కు చాలా కూల్ పర్సన్ అనే ఇమేజ్ ఉంది. అంతేకాదు ఒక తండ్రిగా కూడా ఆయనను అందరూ ‘కూల్ ఫాదర్’ అని పిలుస్తారు. అయితే, తాజాగా ఆయన ముద్దుల కూతురు సోనమ్ కపూర్ ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఓ షోలో ఆమె మాట్లాడుతూ, తనకు ఎవరైనా అబ్బాయిలు దగ్గరవుతున్నారని తెలియగానే…
తన తండ్రి వారికి విలన్ గా మారిపోయేవారని తెలిపింది. తన బోయ్ ఫ్రెండ్స్ జీవితాల్లో ఆయన ఎప్పుడూ విలనే అని చెప్పింది. ఏ రోజూ వాళ్లను ఆయన ప్రేమతో పలకరించిందే లేదని తెలిపింది. వాళ్లతో తనకు మంచి సంబంధాలు లేవని తెలిస్తే మాత్రం ఎంతో సంతోషించేవారని చెప్పింది. కానీ తన భర్త ఆనంద్ అహూజా విషయంలో మాత్రం తన తండ్రి ఎప్పుడూ మంచిగానే ఉన్నారని… నాన్నకు తన భర్త ఎప్పుడూ ఫేవరెట్ పర్సనే అని తెలిపింది.
Tags: rishi kapoor,daughter, love,poonam kapoor,cool dad, anandh ahuja