హీరో తరుణ్ కారుకు యాక్సిడెంట్…తప్పిన ప్రాణనష్టం!

ప్రముఖ టాలీవుడ్ హీరో తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, తరుణ్ కు ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ లో తరుణ్ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది.

ఈ ఘటన ఔటర్ రింగ్ రోడ్ నార్సింగ్ సమీపంలోని అల్కాపూర్ లో ఈ తెల్లవారుజామున జరిగింది. ‘టీఎస్ 09 ఈఎక్స్ 1100’ నంబర్ గల కారులో తరుణ్ ప్రయాణిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో తరుణ్ కు పెద్దగా గాయాలు కాకుండా బయటపడినట్టు తెలుస్తోంది. కారు ప్రమాదం తరువాత, తరుణ్ స్వయంగా ఫోన్ లో మాట్లాడి, మరో కారును తెప్పించుకుని వెళ్లిపోయాడని యాక్సిడెంట్ ను చూసిన స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Leave a Reply