ఆయన నాకు అత్యంత ఆత్మీయుడు: చంద్రబాబు

  • బాలయోగి నాకు అంత్యంత ఆత్మీయుడు
  • సాధారణ స్థాయి నుంచి లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగారు
  • కోనసీమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది

టీడీపీ నేత, లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్మరించుకున్నారు. బాలయోగి జయంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… సామాన్య దళిత కుటుంబంలో జన్మించి, లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. విపక్షాల మన్ననలను కూడా పొందిన గొప్ప నాయకుడైన బాలయోగి తనకు అత్యంత ఆత్మీయుడని చెప్పారు. కోనసీమ అభివృద్ధి కోసం బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపిందని అన్నారు. బాలయోగి జయంతి సందర్భంగా ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందామని చెప్పారు.

Tags: GMC Balayogi, Jayanthi, Chandrababu,TDP

Leave a Reply