ఇక డాలర్ డ్రీమ్సేనా…

డాలర్ డ్రీమ్స్‌తో అవెురికా వెళ్లాలనుకునేవారికి చేదువార్త. హెచ్-1బి వీసాలు ఇక అంత ఆషామాషీగా వచ్చే అవకాశం లేదు. అత్యంత నైపుణ్యం ఉన్నవారికి.. లేదా బాగా పెద్ద జీతాలు ఉండేవారికి మాత్రమే ఆ తరహా వీసా లు రావడానికి ఇక మీదట వీలుంటుం ది. ఈ దిశగా ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసాల దరఖాస్తు విధానంలో సరికొత్త మార్పు చేర్పులు చేయనుంది. భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎక్కువగా కోరుకునే హెచ్-1బి వీసాల దరఖాస్తు విధానంలో మార్పులు చేయాలని ట్రంప్ సర్కారు ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం హెచ్-1బి వీసాలు కావాలనుకునే కంపెనీలు ముందుగానే ఎలక్ట్రానిక్ పద్ధతిలో తమ పిటిషన్లను రిజిస్టర్ చేసుకోవాలి. వీటన్నింటిని బట్టి చూస్తే బాగా నైపుణ్యం ఉన్న, ఎక్కువ జీతాలు వచ్చేవారికి మాత్రమే హెచ్-1బి వీసాలు వచ్చేందుకు ఇక మీదట వీలుంటుంది. చాలావరకు భారతీయులు, చైనీయులే ఈ తరహా వీసాలను పొందుతుంటారు. ఎక్కువగా ఐటీ రంగ నిపుణులకు ఇవి వస్తాయి.కంపెనీలలో సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరైవెునప్పుడు..

అలాంటివాళ్లు ఆ దేశంలో లభించని పక్షంలో విదేశాల నుంచి రప్పించుకుని వారికి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు ఇస్తారు. ఈ తరహా వీసాల మీద ఆధారపడి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మందిని అవెురికన్ టెక్నాలజీ కంపెనీలు విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాయి. అయితే ఇక మీదట మాత్రం ఏడాదికి కేవలం 65వేల మందికి మాత్రమే హెచ్-1బి వీసాలు మంజూరు చేస్తారు. అందులో మొదటి 20 వేల దరఖాస్తులు అవెురికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువు చదివిన వారుంటే వారిని ఈ పరిమితి నుంచి మినహాయిస్తారు.అంటే… అవెురికాలోని విద్యాసంస్థల నుంచి ఒకవేళ మాస్టర్స్ డిగ్రీ పొంది ఉంటే, అలాంటివాళ్లకు వీసా వచ్చే అవకాశాలు ఎక్కువన్న మాట. కేవలం ప్రతిభ ఉన్నవారికి మాత్రమే కొత్త నిబంధనలలో వీసా వస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కొత్త నిబంధనల మీద ప్రజాభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. డిసెంబరు 3వ తేదీ నుంచి వాటిని ఇవ్వచ్చు. జనవరి రెండో తేదీ లోగా మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్-1బి పరిమితి, ఉన్నత విద్య మినహాయింపు రెండూ మొదటి ఐదు రోజుల్లోనే ముగిసిపోతే.. ఉన్నత విద్య మినహాయింపును ముందుగా పరిగణనలోకి తీసుకునేవారు.
Tags: dollar, dreams ,H1B visa