congresss, leader ,revanth reddy, arrest ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511

రేవంత్ రెడ్డి ఆరెస్టు 144 సెక్షన్ అమలు

తెరాస అధినేత కేసీఆర్ మంగళవారం కోస్గిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో రేవంత్ రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు అతని సోదరులను, వాచ్ మెన్, గన్ మెన్లను అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేకుండా ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారంటూ రేవంత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతం పరిగివద్ద వాచ్ మెన్ ను వదిలివెళ్లారు. ఈసీ ఆదేశాలతో రేవంత్ రెరడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయనను జడ్చర్లలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ కు తరలించినట్లు సమాచారం. రేవంత్ పై కొడంగల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కేసులు నమోదు చేశారు. అయన నివాసం వద్ద 100 మందికి పైగా పోలీసు సిబ్బంది మోహరించారు. అంతకుముందు కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీకి పిలుపునివ్వడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్ విధించారు.
Tags: congresss, leader ,revanth reddy, arrest ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511