ajay kallam, cloth, bags supply,ngo

అజేయకల్లం ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్ ల పంపిణీ

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై జరుగుతున్న యుద్ధంలో రోబో వాకర్స్ పాలుపంచుకుంది. ప్లాస్టిక్ భూతం తరిమికొట్టేందుకు అందరూ చేయి చేయి కలపాలని పిలుపునిచ్చింది. గాంధీ జయంతి సందర్భాన్ని రోబో వాకర్స్ ఈ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమానికి వినియోగించుకుంది. రోబో వాకర్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా క్లాత్ బేగ్ ల  వాడకం ఫై అవగాహన కార్యక్రమం జరిగింది.

ఈ  కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్లాత్ బ్యాగ్ లను పంపిణి  చేశారు. స్వచ్ఛంద సంస్థలు మానవాళి మనుగడకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా రోబో వాకర్స్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమానికి ఆయన అభినందనలు తెలిపారు.

Leave a Reply