రాష్ట్ర బీజేపీ మంత్రులకు చలసాని సవాల్…

 

విజయవాడ: ఏపీకి ప్రత్యేకహోదా సాధన సమితి పోస్టర్‌ శుక్రవారం విడుదల అయింది. దీనిని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే బీజేపీ మంత్రులిద్దరూ రాష్ట్ర కేబినెట్‌ నుంచి వైదొలగాలని ఆయన సవాల్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉంటూ సీఎం చంద్రబాబును విమర్శించడం మోసమేనని అన్నారు. రాంమాధవ్‌ చెప్పినట్లు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు.