‘తొలి ప్రేమ’ హిట్ ఎఫెక్ట్ .. నితిన్ సరసన రాశీఖన్నాకు ఛాన్స్

దిల్ రాజు నిర్మాణంలో ‘శ్రీనివాస కల్యాణం’
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్
కథానాయికగా రాశీఖన్నా
రాశీఖన్నా తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తొలిప్రేమ’ .. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాశీఖన్నాను మరో ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చినట్టుగా తెలుస్తోంది.

నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం ‘శ్రీనివాస కల్యాణం’ అనే టైటిల్ ను దీనికి ఖరారు చేశారు. ఈ సినిమా కోసం కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలో రాశీఖన్నాను తీసుకున్నారా? లేదంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.