డీడీలు కట్టని రేషన్‌ డీలర్లను తొలగించండి

డీడీలు కట్టని రేషన్‌ డీలర్లను తొలగించండి

డీడీలు కట్టని రేషన్‌ డీలర్లను తొలగించండి

పేదలకు చేరాల్సిన రేషన్‌ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న రేషన్‌ డీలర్లను వెంటనే తొలగించండి. అధికార యంత్రాంగం ద్వారా ప్రజలకు సరకులు అందేలా చూడండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌, కమిషనర్‌ సీవీఆనంద్‌తో పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 వేల మంది డీలర్లలో 25 జిల్లాలకు చెందిన దాదాపు ఏడు వేల మంది ఇప్పటికే డీడీలు చెల్లించి సరకుల పంపిణికీ సిద్ధమయ్యారని అధికారులు సీఎంకు తెలిపారు. మిగిలిన వారు వేతనాలు పెంచాలని, హెల్త్‌కార్డులు అందించాలనే డిమాండ్లతో డీడీలు కట్టలేదని, డిసెంబర్‌ నెలలో సరకుల పంపిణీకి విముఖంగా ఉన్నారని తెలిపారు. దీంతో కొన్ని చోట్ల పేదలకు సరకులు అందించే పరిస్థితి లేదని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం రూపాయికి కిలోచొప్పున ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల బియ్యం అందిస్తోంది. రూ.వేల కోట్ల భారాన్ని భరిస్తోంది. ఈ సరకుల పంపిణీ కోసం డీలర్లు కమీషన్‌ పద్ధతిన పనిచేస్తున్నారు.వీరి సమ్మె పిలుపునకు అర్థం లేదు. డీడీలు కట్టని డీలర్లును తొలగించి కొత్తవారిని నియమించండి’అని ఆదేశించారు.

admin

Related Posts

leave a comment

Create AccountLog In Your Account