వరల్డ్ రికార్డు సృష్టించిన భారత వాయుసేన విమానం

ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించిన సీ-130 సూపర్ హెర్క్యులస్
లాక్ హీడ్ నుంచి కొనుగోలు చేసిన వాయుసేన
భారత సైన్యం వద్ద మొత్తం 13 విమానాలు
అత్యధిక దూరం ఆగకుండా ప్రయాణించిన విమానం రికార్డును ఇప్పుడు భారత వాయుసేన సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130 సూపర్ హెర్క్యులస్ ప్లేన్ 13 గంటలా 31 నిమిషాల పాటు ఆగకుండా ప్రయాణఇంచిందని, ఇది వరల్డ్ రికార్డని వాయుసేన ఓ ప్రకటనలో వెల్లడించింది. 18వ తేదీన సూర్యోదయానికి ముందే గాల్లోకి లేచిన విమానం, సూర్యాస్తమయం తరువాత ల్యాండ్ అయిందని తెలిపింది. నాలుగు టర్బోప్రాప్ ఇంజన్లతో ఉండే ఈ విమానాన్ని లాక్ హీడ్ తయారు చేసి అందించిన సంగతి తెలిసిందే. సైనిక ఉపకరణాల రవాణాకు ఈ విమానాన్ని వాడుతున్నారు. మొత్తం 13 సీ-130 విమానాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది. హిండన్ ఎయిర్ బేస్ లో ఆరు విమానాలను ఉంచిన వాయుసేన, మిగతావాటిని పశ్చిమ బెంగాల్ లోని పదాగఢ్ స్క్వాడ్రన్ లో కలిపింది. ముందస్తు ఏర్పాట్లు లేని, చదునుగా లేని రన్ వేలపై సులువుగా ల్యాండింగ్ కావడం, టేకాఫ్ తీసుకోవడం ఈ విమానం ప్రత్యేకత.