జగన్ కు నడుం నొప్పి .. ఒత్తిడి పడకుండా నడుం బెల్ట్ ధరించిన నేత!

తొలిరోజు పది కిలోమీటర్లు నడవగానే జగన్ కు నడుంనొప్పి
తిరుపతి నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్టు
ప్రాథమిక చికిత్స అనంతరం, నడుం బెల్ట్ ధరించమని సూచన
నడుం బెల్ట్ ధరించి పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన మూడు రోజులకే ఆయన నడుం నొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం. తొలిరోజు పది కిలోమీటర్లు నడిచిన జగన్ నడుం నొప్పికి గురవడంతో అత్యవసరంగా ఫిజియోథెరపిస్ట్ ని పిలిపించి వైద్య సేవలందించినట్టు పార్టీ వర్గాల సమాచారం. వైద్యుల సూచనల మేరకు నడుంపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు మెడికేటెడ్ బెల్ట్ ను నడుంకు ధరించాలని సూచించారట.

దీంతో, నడుం బెల్టు పెట్టుకుని తన పాదయాత్రను జగన్ కొనసాగిస్తున్నారు. కాగా, తొలిరోజున ఇడుపులపాయ నుంచి వేంపల్లెకు పాదయాత్ర చేసిన జగన్.. వేంపల్లె శివార్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్సులో విశ్రాంతి తీసుకున్న సమయంలోనే, తనకు నడుం నొప్పిగా ఉందని తన అనుచరులకు జగన్ చెప్పారట. వెంటనే, తిరుపతి నుంచి ఫిజియోథెరపిస్టుని పిలిపించగా, ప్రాథమిక చికిత్స చేసినట్టు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.