రెచ్చగొట్టొద్దు.. మ్యాప్ లో కనపడకుండా పోతారు: ట్రంప్

అణ్వాయుధాలున్నాయన్న అహంకారం వద్దు
మాతో పెట్టుకోవద్దు
ఉత్తర కొరియా ఒక నరకం
అణ్వాయుధాలను పోగేసుకున్నాం అనే అహంకారంతో తమను పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దంటూ ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే వైఖరితో ముందుకెళితే, మీ దేశం కనుమరుగవుతుందని హెచ్చరించారు. మీ దగ్గరున్న ఆయుధాలు మిమ్మల్ని ఎంతమాత్రం కాపాడలేవని అన్నారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మిమ్మల్ని క్రమేపీ చీకట్లోకి నెట్టివేస్తున్నాయని తెలిపారు. మీ తాత కలలుకన్న విధంగా ఉత్తర కొరియా స్వర్గంగా మారిపోలేదని కిమ్ జాంగ్ ను ఉద్దేశించి అన్నారు. ఉత్తర కొరియా ఒక నరకమని, అక్కడ ఎవరూ ఉండలేరని చెప్పారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నది ఓ భిన్నమైన ప్రభుత్వమనే విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. తమను రెచ్చగొట్టే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. లేకపోతే, ప్రపంచ పటంలో ఉత్తర కొరియా కనుమరుగవుతుందని హెచ్చరించారు.