తాడేపల్లిలోని సీఎం నివాసం పరిసరాల్లో నిషేదాజ్ఞలు!

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్నిరేషన్ డీలర్లు నేడు ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం నివాసం పరిసరాల్లో నిషేదాజ్ఞలు విధించారు. తాడేపల్లిలో పోలీసు చట్టం అమల్లో ఉందని అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. తాడేపల్లిలో ఆందోళనలు నిర్వహించవద్దని అన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే జగన్ నివాసం వద్ద డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిరంతర పరిశీలన, భద్రతా బలగాలతో పాటు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
Tags: Guntur District,Tadepalli,Cm Jagan, Residence,tadepalli jagan house

Leave a Reply