గల్ఫ్‌ దేశాల్లో రంజాన్ పర్వదినాన్ని నేడు జరుపుకోనున్నారు. సోమవారం రాత్రి నెలవంక కనిపించిందని మక్కా మసీద్ ఇమామ్‌ వెల్లడించారు.

కనిపించిన నెలవంక… గల్ఫ్ దేశాల్లో నేడు రంజాన్, ఇండియాలో రేపు!

గల్ఫ్‌ దేశాల్లో రంజాన్ పర్వదినాన్ని నేడు జరుపుకోనున్నారు. సోమవారం రాత్రి నెలవంక కనిపించిందని మక్కా మసీద్ ఇమామ్‌ వెల్లడించారు. సౌదీ అరేబియా సహా, యూఏఈ, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, ఇరాన్‌, ఇరాక్‌ తదితర దేశాల్లో మంగళవారం ఈద్‌-ఉల్-ఫితర్ జరుపుకోవాలని ఆయన సూచించారు. కాగా, గత రాత్రి ఇండియాలో మాత్రం నెలవంక కనిపించలేదు.

నేడు కనిపిస్తే, రేపు రంజాన్ జరుగుతుంది. ప్రతియేటా గల్ఫ్‌ దేశాల్లో రంజాన్ జరిగిన మరుసటి రోజే ఇండియాలోని ముస్లింలు పండగను చేసుకుంటారు. కాగా, ఈ సంవత్సరం రంజాన్‌ ఉపవాస దీక్షలు 29 రోజులే కొనసాగడం గమనార్హం.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.