lv subramanyam

కొత్త సీఎంకు ప్రాధాన్యత అంశాలు తెలియజేస్తాం: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీలో కొత్త సీఎం జగన్ అని తేలిపోయింది! ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ లో ఏమాత్రం అవకాశాలు లేని స్థితికి అధికార టీడీపీ దిగజారిపోయింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని అధికార వర్గాలు కూడా నిర్ధారించుకున్నాయి. ఈ క్రమంలో కొత్త సీఎం పదవిలోకి వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రాధాన్యత అంశాలను తనకు నివేదించాల్సిందిగా అధికారులను రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఈ వివరాలను నూతన ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎస్ తెలిపారు.

ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు స్పష్టమైన ఉత్తర్వులు అందాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం జగన్ ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఎల్లుండి జగన్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి, ఆపై కొత్త మంత్రివర్గంపై కసరత్తులు ప్రారంభిస్తారని సమాచారం!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.