lagadapati telangana political survey

ఏపీ ఎన్నికల ఫలితాలపై మరో సర్వే.. ఏం చెబుతోంది?

ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకోవడం కోసం జనం ఎగ్జిట్ పోల్స్‌ కోసం ఆసక్తి చూశారు. అనేక సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. ముఖ్యంగా లగడపాటి సర్వేపై జనం ఆసక్తి చూపించారు. 2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలకు పది సీట్లు అటు ఇటుగా వస్తాయని లగడపాటి సర్వే అంచనా వేసింది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఆర్జీ ఫ్లాష్ సర్వే అభిప్రాయపడింది. జగన్ పార్టీకి ఏడు స్థానాలు అటు ఇటుగా 72 సీట్లు వస్తాయని లగడపాటి సర్వే అభిప్రాయపడింది. ఇతరులు 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతారని పేర్కొంది. టీడీపీకి 43 నుంచి 45 శాతం ఓట్లు రానుండగా.. వైఎస్ఆర్సీపీకి 40-42 శాతం ఓట్లు వస్తాయని, జనసేనకు 11 శాతానికి అటు ఇటుగా ఓట్లు పడే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ సర్వే అభిప్రాయపడింది.
https://www.photojoiner.net/image/KEeuFhkJ
మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి * సీపీఎస్ సర్వే టీడీపీ: 43-44, వైసీపీ: 130-133, జనసేన: 0-1 * వీడీపీ సర్వే టీడీపీ: 54-60, వైసీపీ: 111-121, జనసేన : 0-4 * న్యూస్ 24- టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం టీడీపీ 17 (± 3), వైఎస్ఆర్సీపీ 8 17 (± 3) లోక్ సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. * న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం టీడీపీ 10 నుంచి 12 చోట్ల, వైఎస్ఆర్సీపీ 13-14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. * ఐఎన్ఎస్-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు, వైఎస్ఆర్సీపీ 11 లోక్‌సభ స్థానాలు వస్తాయి. మరోవైపు ఆర్ కె ఇమేజ్ గ్రూప్ కూడా ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. మిర్రర్ టుడే మాసపత్రిక కోసం ఆర్ కె ఇమేజ్ గ్రూప్ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సాధారణ గృ‌హిణులు, ఉద్యోగులు, యువత, వృత్తి విద్యా నిపుణులు, డ్వాక్రా గ్రూపులు, పెన్షనర్లు, వివిధ సామాజిక బృందాలను ఆర్ కె ఇమేజ్ సర్వే చేసింది. వారి అభిప్రాయాలను క్రోడీకరించింది. శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వే కోసం 3లక్షల 92 వేలమందిని పైగా కలుసుకుంది. వీరిలో 80 శాతం డ్వాక్రా మహిళలే ఉన్నారు. ఆర్ కె ఇమేజ్ గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం శ్రీకాకుళంలో వైసీపీకి 6, టీడీపీకి 4 స్థానాలు, విజయనగరంలో వైసీపీకి 6, టీడీపీకి 3 సీట్లు, విశాఖపట్నంలో వైసీపీకి 7, టీడీపీకి 7, జనసేనకు 1 సీటు, తూర్పుగోదావరిలో వైసీపీకి 8-11, టీడీపీకి 8-11 మధ్య రావచ్చు. అలాగే పశ్చిమగోదావరిలో హోరాహోరీ పోరు జరిగింది.
వైసీపీకి 7-8, టీడీపీకి 8 లేదా ఏడు సీట్లు దక్కవచ్చు. క‌ృష్ణా జిల్లాలో వైసీపీకి 9-11, టీడీపీకి 5నుంచి 7 సీట్లు, గుంటూరు జిల్లాలో  వైసీపీకి 7-8, టీడీపీకి 9నుంచి10 సీట్లు, ప్రకాశం జిల్లాలో వైసీపీకి6-7, టీడీపీకి 5నుంచి 6 సీట్లు, నెల్లూరు జిల్లాలో వైసీపీకి 7-8, టీడీపీకి 2నుంచి3 సీట్లు, చిత్తూరు జిల్లాలో వైసీపీకి 8-10, టీడీపీకి 4 నుంచి 6 సీట్లు, కడప జిల్లాలో వైసీపీకి 9, టీడీపీకి 1 సీటు, అనంతపురం జిల్లాలో వైసీపీకి 5-6, టీడీపీకి 8నుంచి 9 సీట్లు, కర్నూలు జిల్లాలో వైసీపీకి 10-12, టీడీపీకి 2నుంచి4 సీట్లు వస్తాయని వెల్లడించింది.ఈ ఎన్నికల్లో వైసీపీకి 95 నుంచి109 సీట్లు, టీడీపీకి 66 నుంచి 78 సీట్లు దక్కవచ్చు. ఎన్నో ఆశలతో వచ్చిన జనసేన పార్టీకి ఈ సర్వేలో 1 సీటు దక్కవచ్చని పేర్కొంది.  ఇక ఎంపీ సీట్ల సంగతికి వస్తే ఆర్ కె ఇమేజ్ గ్రూప్ టీడీపీకి 7-9 సీట్లు, వైసీపీకి 16 నుంచి 18 సీట్లు, జనసేనకు 1 సీటు వస్తాయని పేర్కొంది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో టీడీపీకి 41.2 శాతం నుంచి 43 శాతం, వైసీపీకి 44 నుంచి 45.8 శాతం , జనసేనకు 9 నుంచి 11 శాతం పోలవుతాయని ఆర్ కె ఇమేజ్ గ్రూప్ పేర్కొంది. ఇవన్నీ అత్యంత పకడ్బందీగా నిర్వహించిన సర్వే ఫలితాలని, అసలు ఫలితం అటు ఇటుగా ఉండొచ్చని సంస్థ ప్రతినిధి మధు కొండా పేర్కొన్నారు. జాతీయ సంస్థల సర్వేలకు ఈ సర్వే ఫలితాలకు మధ్య సారూప్యం కనిపిస్తోంది.

Source: newsting

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.