బాబు మాస్టర్ ప్లాన్..?..మే 23 తర్వాత ఏం జగనుందో ముందే తెలుసా..?

మే 23 ఈ తేదీ కోసం ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీలు సహా ఇతర రాష్ట్ర పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి.ఏప్రిల్ 11న ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమైన సమాచారం ఆ రోజున వెల్లడి కానుంది.దీనితో మే 23 కోసం ప్రతీ ఒక్కరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ 23 తర్వాత చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటున్నారట.బాబు రాష్ట్ర రాజకీయాలు మరియు కేంద్ర స్థాయి రాజకీయాల్లో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే.

కానీ గత కొన్ని రోజుల నుంచి బాబు తీరు గమనిస్తున్నట్టయితే రాష్ట్ర రాజకీయాలు కన్నా జాతీయ స్థాయి రాజకీయాలనే ఎక్కువ సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉందట. ఏపీలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని,ఏదన్నా అద్భుతం జరిగి వీరు మళ్ళీ అధికారంలోకి రావాలే తప్ప తాము మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని చంద్రబాబుకి ముందుగానే తెలిసిపోయిందన్న టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.అందుకే ఇక ఎలాగో ఇక్కడ గెలవలేము కాబట్టి కేంద్రంలో చక్రం తిప్పాలని బాబు భావిస్తున్నారట.

అందుకే పీఎం పదవినే బాబుగారు టార్గెట్ గా పెట్టుకొని ఆ దిశగా పావులు కదుపుతున్నారు.ఇప్పటికే మోడీయేతర శక్తులు అన్నిటినీ ఏకం చేస్తున్న చంద్రబాబు మోడీకి చెక్ పెట్టే దిశగా అడుగులు వేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ కు కానీ పూర్తి స్థాయి మెజార్టీ కానీ రానట్టయితే మిత్ర పక్షాలు తనకి పూర్తి సహకారం అందిస్తాయన్న ఒక గట్టి నమ్మకంతో బాబు ఉన్నారని తెలుస్తుంది.మరి చంద్రబాబు వేస్తున్న ఈ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో లేదా తిరగబడుతుందో చూడాలి.

Leave a Reply