జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రుల జాబితా..!

ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇంకా వారం రోజులలో వెలువడనున్నాయి. అయితే గత ఎన్నికల కన్నా ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ సారి ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా గెలుపు మాత్రం వైసీపీదేనని తేలిపోయింది. అంతేకాదు ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలు వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ఇప్పటికే రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు ఇప్పటికే జగన్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసారు వైసీపీ నేతలు. ఇంకా ఫలితాలు వెలువడకముందే సంబరాలలో మునిగితేలుతూ గెలుపు పక్కాగా తమదేనని గట్టి ధీమాతో ఉన్నారు. అయితే ఎలాగో వైసీపీ గెలుపు ఖాయమవ్వడంతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాక ఆయన మంత్రివర్గ క్యాబినెట్‌లో ఎవరెవరికి చోటు లభిస్తుందనే దానిపై కూడా లోటస్ పాండ్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయట. అయితే జగన్ ఎవరి పేర్లను అధికారకంగా ప్రకటించకపోయిన ఆ నోటా ఈ నోటా కొన్ని పేర్లు ఇంతకు ముందే తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా జగన్ క్యాబినెట్‌లో ఉండబోయే ఫైనల్ జాబితా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఆ జాబితా ప్రకారం మొత్తం 26 మందికి మంత్రి వర్గంలో చోటు లభించబోతుందని, వారి పేర్లు, శాఖలు కూడా భయటకి రావడం గమనార్హం.

జగన్ కేబినెట్‌లోని మంత్రుల జాబితా:

1) ముఖ్యమంత్రి : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
2) స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
3) డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి
4) హోమ్ మంత్రి : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
5) రెవిన్యూ శాఖ : ధర్మాన ప్రసాద రావు
6) ఐటీ శాఖ : మోపిదేవి వెంకటరమణ
7) పంచాయతీ రాజ్ శాఖ : ఆనం రాంనారాయణ రెడ్డి
8) విద్యుత్ శాఖ : రోజా
9) ఫైనాన్స్ శాఖ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
10) భారీ నీటి పారుదల శాఖ : కొడాలి నాని
11) రోడ్లు & భవనాల శాఖ : బొత్స సత్యనారాయణ
12) మున్సిపల్ శాఖ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
13) పౌర సరఫరాల శాఖ : పిల్లి సుభాష్ చంద్రబోస్
14) స్త్రీ శిశు సంక్షేమ శాఖ : తానేటి వనితా
15) వైద్యఆరోగ్య శాఖ : అవంతి శ్రీనివాస్
16) బీసీ సంక్షేమ శాఖ : తమ్మినేని సీతారాం
17) విద్యా శాఖ : కురసాల కన్నబాబు
18) అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
19) దేవాదాయ శాఖ : కోన రఘుపతి
20) న్యాయ శాఖ : వై. విశ్వేశర రెడ్డి
21) మైనింగ్ శాఖ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
22) సాంఘిక సంక్షేమ శాఖ : భాగ్యలక్ష్మి
23) వ్యవసాయ శాఖ : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
24) సినిమాటోగ్రఫీ శాఖ : గ్రంధి శ్రీనివాస్
25) కార్మిక, రవాణా శాఖ : ఆళ్ళ నాని
26) మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ : అమంచి కృష్ణ మోహన్
27) పరిశ్రమల శాఖ : కాకాని గోవర్ధన్ రెడ్డి
28) టూరిజం, తెలుగు సంస్కృతి శాఖ : కె. ఇక్బాల్ అహ్మద్
29) గృహ నిర్మాణ శాఖ : కొక్కిలిగడ్డ రక్షణనిధి

అయితే జగన్ ప్రచారంలోనే మంత్రి పదవి దక్కే కొందరి పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాను బట్టి చూస్తుంటే జగన్ మంత్రివర్గ క్యాబినెట్‌లో సీనియర్లకు ఎక్కువగా అవకాశం లభించినట్టు అర్ధమవుతుంది. అయితే దీనిపై వైసీపీ మాత్రం మంత్రివర్గం కోసం ఇంకా మేము ఎలాంటి ఆలోచనలు చేయలేదని ఇదంతా నమ్మవద్దని ప్రచారం చేస్తుంది. అయితే వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే జగన్ క్యాబినెట్‌లో ఒకటి రెండు పేర్లు లేక శాఖలు మారే అవకాశం ఉందని మిగతాదంతా సేం ఉండబోతుందని రాజకీయ వర్గాలలో ఈ జాబితాపై చర్చలు నడుస్తున్నాయి.

Leave a Reply