వైఎస్ మాదిరిగానే జగన్ మరో బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నాడుగా..!

ఏపీలో గత నెల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో అందరిలోనూ గెలుపుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. అసలు ప్రధాన పార్టీల నడుమ హొరాహొరీగా సాగిన ఈ మహా సంగ్రామంలో గెలుపెవరిని వరిస్తుందో అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడంలేదు. అయితే ఇప్పటికే వెలువడిన సర్వేలలో చాలా సర్వేలు వైసీపీదే విజయమని చెబుతుండగా, కొన్ని సర్వేలు మాత్రం టీడీపీదే విజయమని చెబుతున్నాయి.

అయితే ఈ ఇరు పార్టీలు సర్వేలను ఆధారంగా చేసుకుని గెలుపు మాదంటే మాది అని ధీమాతో ఉన్నారు. అందులోనే భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ పోలింగ్ సరళిపై మరియు గెలిచే స్థానాలపై గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్‌లు తెప్పించుకుని మరీ లెక్కలు వేస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి కూడా పార్టీ అభ్యర్థులతో కలిసి పోలింగ్ మరియు కౌంటింగ్‌లపై విశ్లేషణలు జరపడానికి రంగం సిద్దం చేసుకున్నారు. అయితే అంత కన్నా ముందు పులివెందులలో మూడు రోజుల పాటు ప్రజా దర్భార్ పేరుతో పర్యటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలోని ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, అధికారంలోకి రాగానే పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సాధించారు.

అయితే ప్రస్తుతం ప్ర‌జా ద‌ర్బార్ కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌గ‌న్ పులివెందులలోని వైసీపీ క్యాంపు కార్యాల‌యానికి రావడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయం నిండుగా కనిపించింది. అంతేకాదు జగన్ పులివెందులలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే ప్రజా దర్భార్. అయితే గతంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకంటే, జగన్ ఏమో ప్రజా దర్భార్ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రజా దర్భార్‌ను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply