దేశ రాజకీయాలలో జగన్‌పై రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ..!

ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది అందరిలోనూ గెలుపెవరిని వరిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే వెలువడిన సర్వేలలో చాలా సర్వేలు జగన్ గెలుపు ఖాయమనే చెప్పేశాయి. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుందని, జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఇప్పటికే అందరికి అర్ధమైపోయింది. అయితే కేంద్రంలో జాతీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే ఖచ్చితమైన మెజారిటీ అవసరం.

అయితే ప్రస్తుతం మారిపోయిన దేశ రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తుంటే ఏ పార్టీకి కూడా ఖచ్చితమైన మెజారిటీ వచ్చే అవకాశం కనపడడంలేదు. అందుకే జాతీయ పార్టీల చూపు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల వైపు పడింది. అందుకే అటు కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి. అందుకే ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుంది అని తేలడంతో ముందు నుంచే జగన్‌కి రాయబారాలు పంపుతున్నాయి. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి అమిత్ షా జగన్‌తో సంప్రదింపులు కూడా జరిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందిని జగన్‌తో మంతనాలు సాగించారు. అందుకే ఈ ఇరు పార్టీల నేతలు కూడా చంద్రబాబు వైఖరిపై కాస్త వ్యతిరేకంగా వ్యవహరిస్తూ జగన్‌కి గాలం వేసే పనిలో నిమగ్నమయ్యాయి.

అయితే ఎవరెన్ని సానుకూలతలు చూపించినా జగన్ మాత్రం ఈ విషయంలో కాస్త క్లారిటీగానే ఉన్నారట. ఎందుకంటే చంద్రబాబు ఐదేళ్ళలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. అందుకే జగన్ ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వాలంటే ముందుగా వారి దగ్గర ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కావాలని వినిపించబోతున్నారట. ఏ పార్టీ అయితే ఏపీకి ప్రత్యేక హోదాను కలిపిస్తుందో వారికే తమ సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తామని జగన్ వర్గాలు చెబుతున్నాయట. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఒక క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఇక బీజేపీ నుంచి మాత్రం ఆ స్పష్టత ఇంకా రాకపోవడంతో జగన్ ఎవరికి ఇంకా మాట ఇవ్వలేదట. అయితే అసలు జగన్ ఎవరికి మద్ధతు ఇవ్వబోతున్నారనేది అనేది మాత్రం ఖచ్చితంగా తేలాలంటే మే 23 ఫలితాల వరకు వేచి చూడక తప్పదు.

Leave a Reply