ys jagan mohan reddy

ప్రతి వైసీపీ అభిమాని కాలర్ ఎగరేసే న్యూస్ వ‌చ్చేసింది..!

దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉన్న‌త విద్యావంతుల‌కు పెద్ద పీట వేసిన పార్టీ ఏది..? ఈ అంశంపైనే ఓ ప్ర‌ముఖ మ్యాగజైన్ అన్ని రాజ‌కీయ పార్టీల నుంచి డేటాను సేక‌రించి వివ‌రాల‌ను వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా చూస్తే ద‌క్షిణ బార‌త‌దేశంనుంచే అత్య‌ధికంగా విద్యావంతుల‌కు పెద్ద పీఠ వేశాయి.

జాతీయ స్థాయి పార్టీల‌కంటే.., ప్రాంతీయ పార్టీల నుంచే అత్య‌ధికంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన వారు ఉన్న‌త విద్యావంతులుగా ఉన్నారు. ఇక పార్టీల‌వారీగా చూస్తే దేశ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న‌త విద్యావంతుల‌కు పెద్ద‌పీట వేసిన పార్టీగా ముందంజ‌లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 88 శాతం మంది ఉన్న విద్యావంతులు బ‌రిలో ఉన్నారు.

వైసీపీ పార్టీనుంచి ఎంపీ టికెట్ పొందిన వారంతా ప‌ట్ట‌భ‌ద్రులు, ఆపై ఉన్న‌త స్థాయి చ‌దువులు చ‌దివిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాక‌, వారిలో డాక్ట‌ర్లు, వైద్యులు కూడా ఉన్నారు. వైసీపీ త‌రువాత దేశ వ్యాప్తంగా రెండో స్థానంలో డీఎంకే ఉంది. డీఎంకే నుంచి 87.5 శాతం మంది ఉన్న‌త విద్యావంతులు బరిలో నిలిచారు. మూడో స్థానంలో త‌మిళ‌నాడుకు చెందిన అన్నా డీఎంకే ఉంది. అన్నా డీఎంకే నుంచి 86 శాతం మంది ఉన్నత విద్యావంతులు లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగి పోటీ చేశారు. ఇక నాలుగో స్థానంలో తెలంగాణ‌కు చెందిన టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ నుంచి 86 శాతం మంది ఉన్న‌త విద్యా వంతులు బ‌రిలో నిలిచారు.

జాతీయ పార్టీల విష‌యానికొస్తే, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల‌కంటే ఈ విష‌యంలో వెనుక‌బ‌డి ఉన్నాయి. బీజేపీ నుంచి 70.8 శాతం మంది ఉన్న‌త విద్యావంతులు పోటీ చేస్తుండ‌గా, కాంగ్రెస్ పార్టీ నుంచి 75.7 శాతంగా ఉంది. మొత్తానికి ఉన్న‌త విద్యావంతుల‌కు పెద్ద‌పీట వేసిన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి స్థానంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.