రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచిన వైఎస్ జగన్!

వైసీపీ మ‌రో సంచలన హామీ – షాక్ లో టీడీపీ నేతలు..!

రాజ‌కీయాల్లో 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకుంటున్న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత‌గా దిగ‌జార్చార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి విమర్శించారు. కాగా, శ్రీ‌కాంత్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌డిచిన ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో మూడున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ప‌నుల‌కు సంబంధించిన బిల్లులకు సంబంధించిన నిధుల‌ను చెల్లించ‌కుండా, టీడీపీ నేత‌లు ఆ నిధుల‌ను దారి మ‌ళ్లించారని విమ‌ర్శించారు.

క‌మీష‌న్ల‌కు టీడీపీ నేత‌లు క‌క్కుర్తి ప‌డ్డార‌ని, క‌మిష‌న్‌లు ఇచ్చిన కాంట్రాక్ట‌ర్ల‌కే టీడీపీ స‌ర్కార్ బిల్లులు చెల్లించింద‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. స‌త్వ‌రం పూర్తి కావాల్సిన ప్ర‌జా అవ‌స‌రాల ప‌నుల‌కు కూడా టీడీపీ సర్కార్ అడ్డు ప‌డింద‌ని, ఆ ప‌నులు పూర్తి కాకూడ‌ద‌ని, అలాగే మే 23న వెలువ‌డ‌నున్న ఫ‌లితాల‌తో వ‌చ్చే కొత్త ప్ర‌భుత్వంలో రాష్ట్రానికి అప్పులు కూడా పుట్ట‌కూడ‌ద‌న్న దురుద్దేశంతో చంద్ర‌బాబు స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు అల‌వాటు చేసుకున్న అవినీతి ప‌నుల‌తో రాష్ట్రాన్ని కూడా అవినీతి మ‌యం చేశార‌ని గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ప్ర‌భుత్వ ఉద్యోగులు వారి వారి పీఎఫ్ నిధుల‌ను తీసుకోకుండా నిబంధ‌న‌ల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ స‌డ‌లించింద‌న్నారు. ఆఖ‌ర‌కు ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ ఆర్టీసీని కూడా న‌ష్టాల ఊపిలో నిలిపిన ఘ‌న‌త ఒక్క చంద్ర‌బాబు స‌ర్కార్‌కే ద‌క్కుతుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

ఏపీ ఆర్టీసీ న‌ష్టాల ఊబిలో కూరుకుపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం టీడీపీ నేత‌లేన‌ని, వారి వారి స్వార్ధ రాజ‌కీయాల కోసం టీడీపీ శ్రేణులు ఏపీ ఆర్టీసీ సౌక‌ర్యాల‌ను విచ్చ‌ల‌విడిగా వాడుకున్నార‌ని, టీడీపీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలితో సంస్థ కార్మికులంద‌రూ తీవ్ర న‌ష్టాల‌ను చ‌విచూడాల్ఇ వ‌చ్చింద‌ని శ్రీ‌కాంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేప‌ట్టిన వెంట‌నే ఏపీ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని, న‌ష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని గ‌ట్టెక్కిస్తామ‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి చెప్పారు.

Leave a Reply