వైసీపీకి ఏప్రిల్ 11న ఏం జరిగిందో మే 23న తెలుస్తుంది..టీడీపీ నేత సంచలనం.!

గత ఏప్రిల్ నెల 11 న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల నడుమ భీకర పోరు జరిగిందని అందరూ అనుకుంటుంటే మరి కొందరేమో అలాంటిది ఏమి లేదు ఈసారి పోటీ వైసీపీ మరియు టీడీపీల మధ్యనే ఉందని చెప్తున్నారు.కానీ ఏది ఏమైనా సరే రాబోయే ఫలితాలపైనే అందరి దృష్టి పడింది.ఈ మధ్యలోనే ఓ పక్క టీడీపీ మరియు వైసీపీ పార్టీల నేతలు ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన బుద్దా వెంకన్న వైసీపీ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.జగన్ ఎన్నికలు ముగిసిన తర్వాత 2014 లోలానే గెలవబోయేది మేమే అని చెప్తూ లోటస్ పాండ్ ఏసీ గదుల్లో జీవనం గడుపుతున్నారని అలాగే రాబోయే ఫలితాల రోజున ఏవేవో అల్లర్లు జరుగుతాయంటూ సరికొత్త నాటకానికి తెర లేపారని వ్యాఖ్యానించారు.అంతే కాకుండా గత నెల ఏప్రిల్ 11 న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారని ఈ విషయం రాబోయే మే 23 ఫలితాల ద్వారా అందరికి తెలుస్తుందని ఘాటైన విమర్శలు చేసారు.మరి దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.

Leave a Reply