TV9 CEO Ravi Prakash booked for forgery

15 ఏళ్ల ప్రస్థానం లో టీవీ9పై మరకలెన్నో!

15 ఏళ్ల ర‌విప్ర‌కాష్ ప్ర‌స్థానం ముగిసిన‌ట్టేనా?. 2004లో 24 గంట‌ల న్యూస్ ఛాన‌ల్స్ అంటూ లేని ద‌శ‌లో స‌రిగ్గా ఎల‌క్ష‌న్స్‌కి ఆరు నెల‌ల ముందు మొద‌లైంది టివీ9 ఛాన‌ల్‌. అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి తెలుగు న్య‌స్ ఛాన‌ల్ గా అన‌తి కాలంలోనే అవినీతి రాయుళ్ల గుండెల్లో హ‌డ‌లెత్తించిన టీవీ9 ఆ త‌రువాత కాలంలో ర‌విప్ర‌కాష్ అంటే టీవీ9.. టీవీ9 అంటే ర‌విప్ర‌కాష్ అన్న స్థాయికి వెళ్లిపోయింది. స్టింగ్ ఆప‌రేష‌న్‌లు, అవినీతి తిమింగ‌లాల‌ని బ‌య‌ట‌పెట్ట‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. టీవీ9 పేరు చెబితే ప్ర‌భుత్వ ఉద్యోగులు పోసుకునే స్థాయిలో టెర్ర‌ర్ పుట్టించింది. అయితే అదే అవినీతిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్‌కు దిగ‌డంతో ప‌తనం మొద‌లైంది.

ఓ ప‌క్క కోట్ల‌కు కోట్టు అవినీత సొమ్ము ర‌విప్ర‌కాష్ ఖాతాలో చేరుతున్నా ఛాన‌ల్ మాత్రం దిన‌దినం దిగ‌జార‌డం మొద‌లుపెట్టిందని బహిరంగంగానే మాట్లాడుకున్నారు. ఎక్క‌డ స్పార్క్ వుందో అక్క‌డ వాలిపోయి మెరిక‌ల్లాంటి స్టాఫ్‌ని ప‌ట్ట‌డంతో ర‌విప్ర‌కాష్ మంచి నేర్ప‌రి. అదే టీవీ9 స‌క్సెస్‌కి ప్ర‌ధాన కార‌ణంగా మారింది. అయితే న్యూస్ పేరుతో 24 గంట‌లు న్యూసెన్స్ చేయాల‌నే విష‌ సంస్కృతిని తెలుగు వార్తా ఛాన‌ళ్ల‌కు తీసుకొచ్చిందే టీవీ9. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. దొరికారా ఆడుకోవ‌డ‌మే అనే సైకిక్ సిద్ధాంతాన్ని అవ‌లంభించిన ర‌విప్ర‌కాష్ రాజ‌కీయ నాయకులు, బిజినెస్ మెన్స్ చివరికి సినిమా వాళ్ల‌ని కూడా వ‌ద‌లలేదు. దానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని లైవ్‌లో శ్రీ‌రెడ్డి ప‌చ్చి బూతు మాట అంటున్నా దాన్ని క‌ట్ చేయ‌కుండా వేసిందే వేసి.. వేసిందే వేసి రాక్ష‌స ఆనందాన్ని పొంద‌డం ఏ మీడియా విలువ‌ల‌కు నిద‌ర్శ‌న‌మో ర‌విప్ర‌కాష్‌కే తెలియాలి అంటున్నారు మిగ‌తా మీడియా జ‌నం.

మెరుగైన స‌మాజం, మీడియాకు ఉన్న‌త స్థాయి విలువ‌ల్ని ఆపాదించాన‌ని చెప్పుకుంటున్న ర‌విప్ర‌కాష్ ఏ స్థాయికి మీడియాను దిగ‌జార్చాడో ఇట‌వల శ్రీ‌రెడ్డి వివాదం త‌రువాత ఆగ్ర‌హం, అస‌హ‌నం క‌ట్ట‌లు తెంచుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన ర‌విప్ర‌కాష్ వీడియోనే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోచ్చు అని ర‌విప్ర‌కాష్ తాజా ఉదంతంపై సెటైర్లు వేస్తున్నారు. అవినీతి, లంచ‌గొండి త‌నం, కులం గోడ‌ల్ని బ‌ద్ద‌లు కొడ‌దాం, మూఢ‌న‌మ్మాక‌లు అంటూ లేని మెరుగైన స‌మాజాన్ని నిర్మిద్దాం అంటూ తెర ముందు నీతులు చెప్పిన ర‌విప్ర‌కాష్ తెర‌వెనుక చేసిన వ‌న్నీ బ‌య‌టికి రావ‌డంతో అత‌ని 15 ఏళ్ల ప్ర‌స్థానం ఒక్క‌సారిగా పేక‌మేడ‌లా కూలిపోవ‌డం చాలా మందికి క‌నువిప్పు కావాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల‌తో పాటు ప‌లు మీడియా వ‌ర్గాలు అంటున్నాయి.

Tags: raviprakash, TV9 ceo, frauds,tv9 media TV9 CEO Ravi Prakash, booked ,forgery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.