Articles Posted in the " National " Category

 • రాష్ట్ర బీజేపీ మంత్రులకు చలసాని సవాల్…

  రాష్ట్ర బీజేపీ మంత్రులకు చలసాని సవాల్…

    విజయవాడ: ఏపీకి ప్రత్యేకహోదా సాధన సమితి పోస్టర్‌ శుక్రవారం విడుదల అయింది. దీనిని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే బీజేపీ మంత్రులిద్దరూ రాష్ట్ర కేబినెట్‌ నుంచి వైదొలగాలని ఆయన సవాల్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉంటూ సీఎం […]


 • పోరాట పంథాకి కారణం ఇదే: చంద్రబాబు

  పోరాట పంథాకి కారణం ఇదే: చంద్రబాబు

  విభజన హామీలను నెరవేర్చనందుకే పోరాట పంథా నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో చూశా ఐదు నదులను అనుసంధానిస్తాం విభజన చట్టంలో ఉన్న అన్నింటినీ సాధించేవరకు విశ్రమించబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో రెండో ఆలోచన లేదని అన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందునే… తాము పోరాట పంథాను ఎంచుకున్నామని తెలిపారు. ఈ నెల 27 నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతోందని… తన రాజకీయ జీవితంలో ఎన్నో […]


 • ఈ కుంభకోణంలో పీఎన్‌బీకి దక్కే బీమా రెండు కోట్లేనట!

  తక్కువ బీమా కవర్ తీసుకున్న పీఎన్బీ ఇందులో మొత్తం స్కాం విలువ కవర్ కాదు ఇతర బ్యాంకులకు ఆయా మొత్తాలను పీఎన్బీనే చెల్లించాలని ఆర్బీఐ ఆదేశం జరిగింది వేల కోట్ల స్కాం.. అయితే బీమా ద్వారా వచ్చేది మాత్రం కేవలం రెండు కోట్లట! అవును, బ్యాంకింగ్ రంగంలోనే పెను సంచలనం రేపిన దాదాపు రూ.11,300 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ‘ఉద్యోగుల మోసం’ ద్వారా ఏదైనా కుంభకోణం జరిగితే వచ్చే మొత్తానికి తీసుకున్న బీమా కవర్ […]


 • సుప్రీం తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: తమిళుల మండిపాటు

  నీటి వాటాలో కోతపై తమిళ సంఘాల స్పందన ఉన్న వాటా తగ్గించడంపై విమర్శలు 15 టీఎంసీలను తగ్గించిన సుప్రీంకోర్టు ఈ ఉదయం కావేరీ నదీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము వ్యతిరేకిస్తున్నట్టు తమిళ సంఘాలు వెల్లడించాయి. ఎన్నో దశాబ్దాలుగా తమిళనాడు అనుభవిస్తున్న నీటి వాటాలో కోత పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్న తమిళులు, రాష్ట్రంలో జనాభా సంఖ్య పెరుగుతుంటే, అదనంగా నీరు కేటాయించాల్సిన స్థితిలో, ఉన్న వాటాను తగ్గించడం ఏంటని మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు కేటాయించిన 177.25 టీఎంసీల […]


 • శివరాత్రి జరుపుకోండి: విద్యార్థులకు లక్నో యూనివర్శిటీ సలహా

  వాలెంటైన్స్ డే రోజున సెలవిచ్చిన వర్శిటీ పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు సలహా ఇంట్లోనే మహాశివరాత్రి జరుపుకోవాలని సూచన రేపు వాలెంటైన్స్ డే అంటూ క్యాంపస్ లో అమ్మాయిలు, అబ్బాయిలు కలసి తిరగరాదని, ఆలా ఎవరైనా కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లక్నో యూనివర్శిటీ హెచ్చరించింది. ప్రియుడు, ప్రియురాలు అంటూ తిరిగే బదులు మహా శివరాత్రి పర్వదినం జరుపుకోవాలని సూచించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొంది. ఈ మేరకు వర్శిటీలో ఓ నోటీసును ఇస్తూ, […]