Articles Posted in the " News " Category

 • రాష్ట్ర బీజేపీ మంత్రులకు చలసాని సవాల్…

  రాష్ట్ర బీజేపీ మంత్రులకు చలసాని సవాల్…

    విజయవాడ: ఏపీకి ప్రత్యేకహోదా సాధన సమితి పోస్టర్‌ శుక్రవారం విడుదల అయింది. దీనిని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే బీజేపీ మంత్రులిద్దరూ రాష్ట్ర కేబినెట్‌ నుంచి వైదొలగాలని ఆయన సవాల్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉంటూ సీఎం […]


 • పోరాట పంథాకి కారణం ఇదే: చంద్రబాబు

  పోరాట పంథాకి కారణం ఇదే: చంద్రబాబు

  విభజన హామీలను నెరవేర్చనందుకే పోరాట పంథా నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో చూశా ఐదు నదులను అనుసంధానిస్తాం విభజన చట్టంలో ఉన్న అన్నింటినీ సాధించేవరకు విశ్రమించబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో రెండో ఆలోచన లేదని అన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందునే… తాము పోరాట పంథాను ఎంచుకున్నామని తెలిపారు. ఈ నెల 27 నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతోందని… తన రాజకీయ జీవితంలో ఎన్నో […]


 • యాదాద్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి షురూ

  11 రోజుల పాటు వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24న తిరుకల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు 27న స్వామి వారి శృంగారడోలోత్సవంతో ఉత్సవాలు ముగింపు పవిత్ర యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువయిన శ్రీ లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 24న జరిగే తిరుకల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి వారు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అదే రోజు గవర్నర్ నరసింహన్ […]


 • ‘తొలి ప్రేమ’ హిట్ ఎఫెక్ట్ .. నితిన్ సరసన రాశీఖన్నాకు ఛాన్స్

  దిల్ రాజు నిర్మాణంలో ‘శ్రీనివాస కల్యాణం’ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ కథానాయికగా రాశీఖన్నా రాశీఖన్నా తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తొలిప్రేమ’ .. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాశీఖన్నాను మరో ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చినట్టుగా తెలుస్తోంది. నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. కథ […]


 • ఈ కుంభకోణంలో పీఎన్‌బీకి దక్కే బీమా రెండు కోట్లేనట!

  తక్కువ బీమా కవర్ తీసుకున్న పీఎన్బీ ఇందులో మొత్తం స్కాం విలువ కవర్ కాదు ఇతర బ్యాంకులకు ఆయా మొత్తాలను పీఎన్బీనే చెల్లించాలని ఆర్బీఐ ఆదేశం జరిగింది వేల కోట్ల స్కాం.. అయితే బీమా ద్వారా వచ్చేది మాత్రం కేవలం రెండు కోట్లట! అవును, బ్యాంకింగ్ రంగంలోనే పెను సంచలనం రేపిన దాదాపు రూ.11,300 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ‘ఉద్యోగుల మోసం’ ద్వారా ఏదైనా కుంభకోణం జరిగితే వచ్చే మొత్తానికి తీసుకున్న బీమా కవర్ […]