Articles Posted by the Author:

 • ఆగస్టు 15న రైతుబీమా అన్నదాతకు అదే రోజు బీమా పత్రాల పంపిణీ

  అన్నదాతకు అదే రోజు బీమా పత్రాల పంపిణీ ఏ కారణంతో మరణించినా పది రోజుల్లో పరిహారం 18 నుంచి 59 ఏళ్లలోపు రైతుల పేర్ల నమోదు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు: ఎల్‌ఐసీ వచ్చే ఆగస్టు 15న ‘రైతు బీమా’ పథకాన్ని ప్రారంభించి రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని […]


 • రైతుల రుణమాఫీకి సీఎం కుమారస్వామి హామీ

  ఐదేళ్లూ పాలిస్తామని ధీమా కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌)లది అపవిత్ర బంధం సభలో యడ్యూరప్ప ధ్వజం ఎట్టకేలకు కర్ణాటక రాజకీయ చదరంగానికి ఒక ముగింపు వచ్చింది. అనేక ఉత్కంఠభరిత పరిణామాల అనంతరం… శుక్రవారం శాసనసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి విజయం సాధించారు. బలపరీక్షకు ముందే విపక్ష భాజపా సభ నుంచి వాకౌట్‌ చేయడంతో… కుమారస్వామి విజయం నల్లేరుపై నడక అయింది. కాంగ్రెస్‌, జనతాదళ్‌ (ఎస్‌) సంకీర్ణ పాలన ప్రారంభానికి మార్గం సుగమమైంది. సభ ప్రారంభం కాగానే నూతన సభాపతిగా […]


 • హైదరాబాద్‌లో ‘నిఫా’ కలకలం!

  హైదరాబాద్‌లో ‘నిఫా’ సోకినట్లుగా సందేహించిన ఇద్దరు రోగుల్లో ఆ వైరస్‌ లేనట్లు నమూనా పరీక్షల్లో వెల్లడికావడంతో వైద్య ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. కేరళ వెళ్లి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఆ వ్యాధి లక్షణాలు కన్పించడంతో వారి నుంచి రక్తం తదితర నమూనాలను సేకరించి శుక్రవారం ఉదయం పుణెలోని ప్రయోగశాలకు అత్యవసరంగా పంపించారు. వారికి నిఫా వైరస్‌ సోకలేదని పుణెలోని ప్రయోగశాల నుంచి శుక్రవారం రాత్రి ఫలితాలు వెల్లడైనట్లు వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ ఇద్దరు […]


 • విజయ్ దేవరకొండ సినిమాలో మల్లూ బ్యూటీ

  తమిళ, మలయాళ ‘భరత్..’ విడుదల వాయిదా నైజాంలో ‘మహానటి’ సంచలన షేర్ విలన్ పాత్రల వైపు సీనియర్ నటుడు * మల్లూ బేబీ అనూ ఇమ్మానుయేల్ త్వరలో విజయ్ దేవరకొండ సరసన నటించనుంది. పరశురాం దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి అనూ ఇమ్మానుయేల్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందులో ఆమెది కీలక పాత్ర అని తెలుస్తోంది. * మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘భరత్ అనే నేను’ తమిళ, […]


 • రషీద్‌ సన్‌చలనం

  బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన సన్‌రైజర్స్‌ అనూహ్య విజయం చెన్నైతో రేపు తుది పోరు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిష్క్రమణ రషీద్‌ ఖాన్‌.. రషీద్‌ ఖాన్‌.. రషీద్‌ ఖాన్‌..! బ్యాటింగ్‌లో అతడే.. బౌలింగ్‌లో అతడే.. చివరికి ఫీల్డింగ్‌లోనూ అతడే..! బ్యాటుతో కేవలం 10 బంతుల్లో 34 పరుగులు సాధించాడు.. 150కి పరిమితమవుతుందనుకున్న సన్‌రైజర్స్‌ ఏకంగా 174 పరుగులతో ఇన్నింగ్స్‌ ముగించింది. బంతితో 4 ఓవర్లేసి 19 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.. అలవోకగా గెలిచేలా […]