9న ‘దోస్త్’ ప్రవేశ ప్రకటన

  • మే 9న నోటిఫికేషన్.. 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది మే 27
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు మే 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. గురువారం (మే 3న) ఉన్నత విద్యామండలి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మే 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.  డిగ్రీలో ప్రవేశాలకోసం   ‘దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సిస్టం ఆఫ్ తెలంగాణ)’ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 27 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటికే గుర్తింపు పొందిన ప్రైవేటు డిగ్రీ కళాశాలల జాబితాను దోస్త్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

గతేడాది వరకు ‘మీ సేవా’ కేంద్రాలతో పాటు ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నుంచి నమోదు చేసుకొనే సౌకర్యం ఉండేది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 76 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని సహాయ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత, అందులో ఉత్తీర్ణులైన వారి కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించనున్నారు.

Leave a Reply