12 నియోజకవర్గాల్లో 16 మంది టీ‘ఢీ‘పీ ఎమ్మెల్యేలు

తెలంగాణ ఎన్నికలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికల తరహా లో ఇక్కడ కూడా రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ సత్తా ఏంటో చూపించాలని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశానో, సైబరాబాద్‌ను ఎలా తీర్చి దిద్దానో పదే పదే చెబుతూ.. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టిపెట్టి అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. కేవలం ప్రచారంతోనే సరిపెట్టడం కాకుండా వ్యూహరచనలోనూ ఆయన తనదైన శైలి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలను చంద్రబాబు అప్రమత్తం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అమలుచేశారో.. ఇక్కడా అదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం అన్ని నియోజవకర్గాల నుంచి రోజూ అప్‌డేట్స్ తెప్పించుకుంటు న్నారు. అక్కడి నేతలకు ఎలక్షనీరింగ్‌ను వివరిస్తున్నారు. ఇటీవలి కాలంలో తరచు తనను తిట్టి పోస్తున్న ఒకనాటి తన అనుచరుడు, తెలం గాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన దెబ్బేమిటో రుచిచూ పించా లని చంద్రబాబు తహతహలాడుతున్నారు. అందుకోసం ఈ నియోజక వర్గాలకు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ పహిల్వాన్లను దించేశారు.తెలంగాణలో ప్రజాకూటమి తరఫున తాము పోటీ చేస్తున్న ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా అత్యంత కీలకైవెునదేనని భావించిన చంద్రబాబు.. ఇక్కడ అన్నింటినీ గెలుచుకుంటేనే రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నేతలకు క్లాస్ తీసుకుంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మోహరించినట్లే ఇప్పుడు కూడా తెలంగాణలో టీడీపీ నేతలను చంద్రబాబు దించేశారు.

తనకు అత్యంత ఆప్తులు, విశ్వసనీయంగా ఉన్నవారిని నియోజకవర్గాలుగా ఇన్‌చార్జులుగా నియమించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొత్తం 12 స్థానాల్లో పోటీచేస్తోంది. వీటిలో పలుచోట్ల స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి ఖమ్మం బహిరంగసభ, సనత్‌నగర్ రోడ్ షోలలో పాల్గొన్న చంద్రబాబునా యుడు.. ఆ తర్వాత శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి లాంటి ప్రాంతాలపై దృష్టి సారించారు. నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో… అక్కడకు తాను స్వయంగా వెళ్లడంతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, సినీహీరో బాలకృష్ణను ప్రచారానికి పంపుతున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారం చేస్తారని తొలుత భావించినా, కేవలం మద్దతు ఇచ్చినట్లు ప్రకటనతోనే ఆయన సరిపెట్టేలా ఉన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన.. నమ్మకస్తులెన టీడీపీ నేతలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీచేస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గానికి పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, జూపూడి ప్రభాకర్, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలను ప్రచారం కోసం వినియోగిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలకు కూడా కొంతమంది ఎమ్మెల్యేలను ఇన్‌చార్జులుగా నియమించారు. వీరందరి నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ తగు సూచనలు చేస్తున్నారు. దీన్నిబట్టి తెలంగాణ ఎన్నికలను చంద్రబాబు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో స్పష్టమవుతుంది.

నియోజకవర్గాల వారీగా బాధ్యులు వీరే..
కూకట్ పల్లి – పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి, జూపూడి ప్రభాకర్
ఉప్పల్ – రామానాయుడు (పాలకొల్లు ఎమ్మెల్యే)
శేరిలింగంపల్లి – బోడే ప్రసాద్ (పెనమలూరు ఎమ్మెల్యే)
సనత్‌నగర్ – ఆలపాటి రాజేంద్రప్రసాద్ (తెనాలి)
ఇబ్రహీంపట్నం – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (పీలేరు ఇన్‌చార్జి)
రాజేంద్ర నగర్ – గణబాబు (విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే)
మహబూబ్ నగర్ – జయనాగేశ్వర్ రెడ్డి (ఎమ్మిగనూరు ఎమ్మెల్యే)
మక్తల్ – బీసీ జనార్ధన్ రెడ్డి (బనగానపల్లె ఎమ్మెల్యే)
సత్తుపల్లి – యరపతినేని శ్రీనివాసరావు (గురజాల ఎమ్మెల్యే)
ఖమ్మం – ఏలూరి సాంబశివరావు (పర్చూరు ఎమ్మెల్యే)
అశ్వారావుపేట – గన్ని వీరాంజనేయులు (ఉంగుటూరు ఎమ్మెల్యే)
వరంల్ పశ్చిమ నియోజకవర్గం – అశోక్ రెడ్డి (గిద్దలూరు ఎమ్మెల్యే)
Tags: Ap TDP mla’s, in telangana ,assembly, elections 2018
Ap TDP mla’s in telangana assembly elections