హైదరాబాదులో విధ్వంసం సృష్టించిన పిడుగు

హైదరాబాదులో నిన్న సాయంత్ర భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపించాయి. భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇదే సమయంలో చాదర్ ఘాట్ లోని ఓల్డ్ మలక్ పేట్ రేస్ కోర్స్ సమీపంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. ఒక్క సారిగా భారీ శబ్దం రావడంలో ఇంట్లోని వారు బయటకు పరుగులు పెట్టారు.

అయితే, పిడుగు ధాటికి ఇంటి పైకప్పు, గోడలు బీటలు వారాయి. గోడ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ఘటనలో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Tags: Hyderabad, Rain Thunder

Leave a Reply