Puttaparthi Narayanacharyulu 105th Birth Anniversary

శిల్ప కళా వైభవం

ఉలిచే రాలకు చక్కిలింతలిడి ఆయుః ప్రాణముల్ వోయు శిల్పకళా మాధుర్య ప్రపంచము లయమున్ చెందెన్ అంబా ! ఇక ఆంధ్రుల హస్తంబందు కలవే నాటి మాహాత్మ్యముల్ ? పుట్టపర్తి నారాయణాచార్యులు 14 భాషల్లో పండితుడు . శతాధిక గ్రంథ కర్త . తను రాసిన పద్య కావ్యమే తన డిగ్రీ పరీక్షలో పాఠ్య ప్రశ్నగా ఎదుర్కొన్న ఒకే ఒక కవి . జన్మతః వైష్ణవుడై శివతాండవాన్ని తెలుగు పద్యంలో బంధించినవాడు . వ్యాకరణ , సంగీత , సాహితీ సముద్రాల లోతులు చూసినవాడు . జ్ఞాన పీఠం దాకా వెళ్లి , పీఠం అందకుండానే కీర్తి శేషుడయినవాడు . అనేక భాషల పలుకు కులుకులతో నడిచే గ్రంథాలయంగా -సరస్వతీ పుత్ర – బిరుదు నామమయినవాడు . ఇప్పటి తరం కొలవడానికి , ఊహించడానికి వీలుకాని వాడు .

తను పుట్టి పెరిగిన ఊళ్ళో ఏ రాయిని కదిలించినా విజయనగరాజ్య వైభవ దీప్తులే గానం చేస్తుంటాయి . అలా తన 13 వ ఏట పెనుగొండ లక్ష్మి కావ్యం రాశారు పుట్టపర్తి . అందులోని పద్యమిది . ఉలి తీసుకుని శిల్పులు రాళ్లకు చక్కిలిగింతలు పెడుతుంటే ఆ రాళ్లు నవ్వుతూ హొయలు పోయాయి . ఉలి మొనతో శిల్పులు రాళ్లకు ప్రాణం , దీర్ఘ ఆయుష్షు పోశారు . అదొక కళా మధుర ప్రపంచం . అలాంటి సజీవ శిల్పాలను ఆవిష్కరించే శక్తి , మహత్తులు తెలుగు శిల్పుల్లో ఇప్పుడేమయిపోయాయో ?

శుభోదయం
-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply