‘వెంకీమామ’లో వెంకటేశ్ .. చైతూ పాత్రలు ఇవే

బాబీ దర్శకత్వంలో వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా ‘వెంకీమామ’ సినిమా రూపొందుతోంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రిలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో రైస్ మిల్లు ఓనర్ గా వెంకటేశ్ .. మిలటరీ ఆఫీసర్ గా చైతూ కనిపించనున్నట్టు తెలుస్తోంది. సురేశ్ బాబు .. కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ‘ఎఫ్ 2’లో వరుణ్ తేజ్ తో కలిసి హిట్ కొట్టిన వెంకటేశ్ .. చైతూతోను కలిసి హిట్ కొడతాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.