వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన థ్రిల్లర్ మూవీగా 'విశ్వామిత్ర'

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన థ్రిల్లర్ మూవీగా ‘విశ్వామిత్ర’

‘గీతాంజలి’.. ‘త్రిపుర’ వంటి హారర్ థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన రాజకిరణ్, దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా ఆయన మరో హారర్ చిత్రాన్ని రూపొందించాడు .. అయితే ఈ సారి ఆయన కథను వాస్తవ సంఘటనల నుంచి గ్రహించాడు. అమెరికా .. న్యూజిలాండ్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేసుకున్నట్టుగా రాజ కిరణ్ చెప్పాడు.

‘విశ్వామిత్ర’ పేరుతో నిర్మితమైన ఈ సినిమా నుంచి ఈ నెల 21వ తేదీన ట్రైలర్ ను వదలనున్నారు. వచ్చేనెల 21వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నందితా రాజ్ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ప్రసన్న .. అశుతోష్ రాణా .. ‘సత్యం’ రాజేశ్ .. విద్యుల్లేఖ రామన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.