వరుస తప్పులతో కేసీఆర్ సెల్ఫ్ గోల్

తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌జాకూట‌మిలో రాహుల్‌-చంద్ర‌బాబుల కంటే కూడా రేవంత్ రెడ్డి ఎక్కువ పాపుల‌ర్ అయ్యారు. కేసీఆర్ కు పోటీగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతూ ప్ర‌జాకూట‌మి అభ్యర్థుల త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముందు నుంచి తెలంగాణ‌లో కేసీఆర్‌కు మింగుడ‌ప‌డ‌ని వ్య‌క్తి రేవంత్‌. రాజ‌కీయంగా అత‌ని అడ్డు తొలగించుకోవ‌డానికి కేసీఆర్, రేవంత్‌ను బ‌ల‌హీన పర‌చ‌డానికి కేసీఆర్ ఎప్ప‌టిక‌పుడు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా చాలా త‌ప్పులు చేశారు. కేసీఆర్ చేసిన ప్ర‌తిప్ర‌య‌త్నం రేవంత్ ను మ‌రింత పాపుల‌ర్ చేస్తూనే వస్తోంది. కొడంగ‌ల్‌లో స‌భ పెట్టుకున్న కేసీఆర్‌… రేవంత్ ఉండ‌గా తాను స‌భ స‌క్సెస్ చేయలేన‌ని భావించి ముంద‌స్తుగా పార్టీ కేడ‌ర్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి అరెస్టు చేయించారు. సాధార‌ణంగా ఇలాంటి సంద‌ర్భాల్లో కేవ‌లం గృహ‌నిర్బంధం చేస్తారు. అయితే, గృహ నిర్బంధంతో రేవంత్ అనుచ‌రుల‌ను త‌ట్టుకోలేమ‌ని భావించిన కేసీఆర్‌… చాలా సినిమాటిక్‌గా పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. ఈ సందర్బంగా దిద్దుకోలేని తప్పు చేశారు. అత్యంత విచార‌క‌ర‌మైన ప‌ద్ధ‌తిలో రేవంత్‌ను అర్ధ‌రాత్రి బెడ్‌రూమ్‌లో నుంచి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో అరెస్టు చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. దీంతో రేవంత్ అభిమానుల‌న్లోనే కాకుండా సాధార‌ణ ప్ర‌జ‌ల్లో కూడా కేసీఆర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది.

ముఖ్య‌మంత్రి స‌భ పెట్ట‌డానికి ప్ర‌తిప‌క్ష పార్టీ అభ్య‌ర్థిని అరెస్టు చేయ‌డం ఏంట‌ని? జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు.ఈ త‌ప్పు వ‌ల్ల కేసీఆర్‌కు ప‌డాల్సి ఓట్లు భారీ ఎత్తున ప్ర‌జాకూట‌మి వైపు ట‌ర్న్ అయిన‌ట్లు చెబుతున్నారు. పాల‌మూరును బంగారు ప‌ళ్లెంలో పెట్టి కేసీఆర్ స్వ‌యంగా రేవంత్‌కు అప్ప‌గించార‌ని… ఈ అరెస్టు వ‌ల్ల కాంగ్రెస్‌కు విప‌రీత‌మైన సానుభూతి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. టీఆర్ఎస్ వైఫ‌ల్యానికి రేప్పొద్దున కార‌ణాలు వెతుక్కుంటే… అందులో ఈ త‌ప్పు…నెం.1 కార‌ణంగా క‌నిపిస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఈ చ‌ర్య ఏ మాత్రం ప్ర‌జాస్వామ్య‌యుతంగా లేదు. ఇంత‌కాలం ఈసీపై ఎవ‌రికీ అనుమానాలు రాలేదు గాని… అరెస్టు ఇంత దారుణంగా చేయించి అది మేమే చేయించామ‌ని ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే… ఈసీని ఎవ‌ర‌యినా ప్ర‌భావితం చేస్తున్నారా అన్న అనుమానాలు ప్ర‌జ‌లు వ్య‌క్తంచేస్తున్నారు
Tags: kcr ,self goaler, revanth reddy