వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్‌తో కలిస్తే ఆయనకొచ్చే బాధేంటని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్‌తో కలవడానికి తాము సిద్ధమే అన్నట్లు సూచన ప్రాయంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. దీనిపై పవన్ స్పందించలేదంటూ ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. మొత్తానికి బాబు వ్యాఖ్యలపై జనసేన అధినేత గురువారం స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితోనూ కలిసే ఆలోచన లేదని పవన్ స్పష్టం చేశారు. కేవలం వామపక్షాలతోనే తామె వెళ్తామని చెప్పారు. మొత్తం 175 స్థానాల్లో జనసేన పార్టీ సంపూర్ణంగా పోటీచేస్తుందని వెల్లడించారు. జనసేన పార్టీ ఎన్నికల కోసం మాత్రమే రాలేదని, పాతిక తరాల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి, వారికి మెరుగైన జీవన విధానాన్ని కల్పించడానికి వచ్చిందన్నారు.

యువత ఆశయాలను, ఆడపడుచుల ఆకాంక్షలను అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నామని పవన్ చెప్పారు. జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలిసి వెళ్ళము. యువతకు , మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి -2014లో కొన్ని పార్టీలకు మద్దతిచ్చాం. తెలుగు ప్రజల సుస్థిరత కోసం ఆ రోజున ఆ పార్టీలకు మద్దతివ్వాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు జనసేన పార్టీ సమతుల్యత కోసం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాం. మేం కలుపుకునేది కూడా ఒక్క వామపక్షాలనే తప్ప ఇంకే అధికార పక్షంతో గానీ, ప్రతిపక్షంతో గానీ కలిసే అవకాశాలు లేవు. కానీ, జనసే పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే విధంగా అధికార పక్షం, ప్రతిపక్షం ప్రవర్తిస్తున్నాయి. జనసేన పార్టీ మద్దతుదారులు ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే.. జనసే పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తుంది’ అని పవన్ కుండ బద్దలుకొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.