మేడ్చల్‌లో విషాదం

నలుగురు కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. డబుల్‌ బెడ్‌రూం బిల్డింగ్‌ నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపైనుంచి పడి నలుగురు బలయ్యారు. మేడ్చల్ జిల్లాలో కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రాంపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం భవనం నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో భవన నిర్మాణ పనుల కోసం ఉపయోగించిన గోవాతాళ్లు తెగిపోవడంతో-నలుగురు కార్మికులకు భవనం నుంచిపైనుంచి పడిపోయి మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.