Andhra govt losing sleep over Jagan’s yatra, says YSRCP’s Roja

బాబును ప్రజలు నమ్మడంలేదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. జాతీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని కాపాడుకోలేక పోయారని, ఇక దేశాన్ని ఏం కాపాడుతారని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ ఓటమితో ఏపీ ప్రజలు సంతోషంతో ఉన్నారన్నారు ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోవడం గమనార్హమని తెలిపారు.

ప్రకటనలకు ఇచ్చే డబ్బును సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణాలపై సీఎంది ఒక మాట, మంత్రిది మరోమాట అని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు అరాచకాలను వినే, ఇక్కడ టీఆర్ఎస్ కు ఓటు వేశారని చెప్పారు. ఏపీలో కూడా టీడీపీని తిప్పి కొడతారని అన్నారు. తెలంగాణ ప్రజల్లాగానే ఏపీ ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తారని అన్నారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన విధంగానే, జగన్ ను ఏపీ ప్రజలు ఆశీర్వదించాలని… అప్పుడే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.