బన్నీ జోడీగా రష్మిక ఖరారయ్యే ఛాన్స్

బన్నీ జోడీగా రష్మిక ఖరారయ్యే ఛాన్స్

అల్లు అర్జున్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పరంగా ఓకే అనిపించుకున్న త్రివిక్రమ్, మిగతా పనులపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో కథానాయికలుగా కైరా అద్వానిగానీ .. రష్మిక మందనగాని ఎంపిక కావొచ్చనే టాక్ వినిపించింది. దాంతో కైరానే తీసుకోవచ్చని చాలామంది అనుకున్నారు.

ఇప్పుడేమో రష్మిక పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గ్లామర్ పరంగా చూసుకుంటే రష్మిక కంటే ఎక్కువ మార్కులు కైరాకే పడతాయి. కైరా మంచి పొడగరి .. అందువలన ఆమె బన్నీ పక్కన సెట్ కాదనే ఉద్దేశంతోనే రష్మికను తీసుకోవాలని చూస్తున్నారట. అందువలన రష్మిక ఎంపిక ఖరారు కావొచ్చుననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. రష్మిక ఎంపిక నిజంగానే జరిగితే తెలుగులో ఆమె చేసే మొదటి పెద్ద సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.