ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిన ఉద్యోగులు… పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి ఆధిక్యం!

ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకతతో ఉన్నట్టు తమ ఓట్లతో స్పష్టం చేశారు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపులో భాగంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు వేసిన ఓట్లను తెరువగా, పలు ప్రాంతాల్లో తెలుగుదేశం అభ్యర్థులతో పోలిస్తే, వైసీపీ అభ్యర్థులకు అధిక ఓట్లు వస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Leave a Reply