For Telugu Actress Who Stripped Spoke Of Casting Couch

నన్ను పబ్లిక్ టాయిలెట్ లా వాడారు: శ్రీరెడ్డి

ఒకప్పుడు తనను చాలామంది పబ్లిక్ టాయిలెట్ లా వాడారని అంటోంది నటి శ్రీరెడ్డి. ఆఫర్లు ఇస్తామంటూ రప్పించుకొని తనను వేధించారని ఆరోపించింది. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ పై, మీ-టూ ఉద్యమంపై తనదైన శైలిలో స్పందించిన శ్రీరెడ్డి… ఈసారి కాస్త ఓపెన్ గానే తన బాధలు చెప్పుకొచ్చింది. గతంలో తనకు ఎదురైన అనుభవాల్ని పబ్లిక్ టాయిలెట్ తో పోల్చింది. “ఓ పబ్లిక్ టాయిలెట్ లా నన్ను వాడారు. ఆ గాయాలు ఎప్పటికీ మానవు. మానసికంగా నన్ను దారుణంగా దెబ్బతీశాయి. అప్పటి ఘటనల్లో నా ప్రమేయం ఉందని నాకు తెలుసు. కానీ సినిమా ఆఫర్ల కోసం అప్పట్లో కొన్ని పనుల్లో ఓ శవంలా పాల్గొన్నాను. నన్ను నమ్మండి.. మనస్పూర్తిగా నేను ఆ పనులు చేయలేదు.”

అప్పట్లో జరిగిన ఘటనల్ని తన జీవితంలో భయంకరమైనవిగా చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డమే తన జీవితాన్ని బాగా ప్రభావితం చేసిందని, ఇప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదని అంటోంది. వీటికితోడు ఇప్పుడు ఓ తమిళ హీరో తనపై కక్షకట్టాడని ఆరోపిస్తోంది శ్రీరెడ్డి. “ఇప్పుడు ఓ తమిళ హీరో నా ప్రొఫెషనల్ లైఫ్ ను నాశనం చేయడానికి చూస్తున్నాడు. తెలుగు సినీ జనాలకు కూడా అతడు చాలా క్లోజ్. అతడు పెద్ద కామాంధుడు.” గతంలో కాస్టింగ్ కౌచ్, మీ-టూ ఉద్యమం పేరిట పలువురు ప్రముఖుల పేర్లను పబ్లిక్ గానే ప్రస్తావించింది శ్రీరెడ్డి.

మరికొంతమంది సెలబ్రిటీల పేర్లను కాస్త అటుఇటు మార్చి చెప్పింది. కానీ ఈసారి మాత్రం ఆ తమిళ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం చూచాయగా కూడా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈమె తమిళ్ లో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు-నటుడు రాఘవేంద్ర లారెన్స్ కూడా ఈమెకు ఓ ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడు. తెలుగులో మాత్రం శ్రీరెడ్డికి ఇంకా అవకాశాలు తలుపు తట్టలేదు.