తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ పై ఏపీ మంత్రి లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ విమర్ళలు గుప్పించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ ప్రధాని మోదీకి బీ-టీమ్ గా ఉన్నారని వ్యాఖ్యానించారు.

లోకేశ్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పశ్చిమబెంగాల్ సీఎం మమతా దీదీకి మద్దతుగా కోల్ కతా ర్యాలీలో పాల్గొంటే, ఫెడరల్ ఫ్రంట్ కు సుప్రీం లీడర్ అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి, అవినీతి రాజు అయిన దొంగబ్బాయి మాత్రం కనిపించలేదు. వీరిద్దరూ మోదీ బీ-టీమ్ అనడానికి ఇంతకంటే ఆధారం ఏం కావాలి’ అని ట్వీట్ చేశారు.