తెలంగాణలో మందు బాబులకు షాక్..మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్!

తెలంగాణలో మందు బాబులకు షాక్..మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్!

రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం
పోలింగ్ ముగిశాక నిషేధం ఎత్తివేత
కౌంటింగ్ సందర్భంగా మళ్లీ రెండ్రోజులు బంద్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మందుబాబులకు ఇబ్బంది ఎదురుకానుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం అమ్మకాలను నిలిపివేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రం 6 గంటలకు ముగిసిన తర్వాత అమ్మకాలపై నిషేధం ప్రారంభం అవుతుందని వెల్లడించింది. చివరగా పోలింగ్ జరిగే డిసెంబర్ 7న సాయంత్రం 6 గంటల వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. అలాగే ఫలితాలు వెలువడే డిసెంబర్ 11న ఉదయం 6 గంటల నుంచి మరుసటిరోజు మధ్యాహ్నం వరకూ మద్యం అమ్మకాలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.