తమిళనాడు ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న ‘మక్కళ్ నీది మయ్యం’

తమిళనాడు ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న ‘మక్కళ్ నీది మయ్యం’

వచ్చే నెల 19న ఉపఎన్నికలు
4 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నిక
తమ అభ్యర్థులను ఈరోజు ప్రకటించనన్న కమలహాసన్
వచ్చే నెల 19న తమిళనాడులోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉపఎన్నికల్లో తమ పార్టీ బరిలోకి దిగనున్నట్లు మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వెల్లడించారు. అరవకురిచ్చి, సూళూర్, ఒట్టపిడారం, తిరుప్పరకుండ్రం అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లనుకమలహాసన్ ఈరోజు ప్రకటించనున్నట్టు సమాచారం. సోమవారం తమ అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తారని, తమ గెలుపు ఖాయమంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నాలుగు శాసనసభ స్థానాలు తమకు చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. కాగా, ఉపఎన్నికలు జరగనున్న ఆయా స్థానాల్లో అన్నాడీఎంకే, డీఎంకే, దినకరన్ పార్టీ అమ్మా మక్కళ్ మున్నేట్ర కళగం, సీమాన్ నామ్ తమిళర్ పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. మక్కళ్ నీది మయ్యం పార్టీ అభ్యర్థులను ఈరోజు ప్రకటిస్తే ఆయా స్థానాల్లో ఐదు పార్టీలు పోటీపడుతున్నట్లు అవుతుంది.

Leave a Reply