డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే జైలు శిక్ష

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే జైలు శిక్ష

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నా నిర్లఖ్యం వహిస్తూనే ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 59 మందికి కూకట్ పల్లి 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 2 రోజుల జైలుశిక్ష విధించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 137 మందిని పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి శ్రీదేవి విచారించి శిక్షలు ఖరారు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 78 మందికి 3 నుంచి 15 రోజుల శిక్ష విధించారు. సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ పట్టుబడ్డ ముగ్గురికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. వీరు మరోసారి ఇలాగే పట్టుబడితే, జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. కూకట్‌ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, మియాపూర్‌, బాలానగర్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో జరిపిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.

Leave a Reply