జింబాంబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ఇక లేరు

ఆఫ్రికా దిగ్గజ నేత, జింబాంబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ఇక లేరు .  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముగాబే సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మనంగ్వా ప్రకటించారు. ఆఫ్రికా దేశమైన జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే శకం ముగిసింది.  1980 నుంచి 2017 వరకూ సుదీర్ఘ కాలం జింబాబ్వేకు అధ్యక్షుడిగా పనిచేసిన రాబర్ట్ ముగాబే(95) ఈరోజు కన్నుమూశారు. 1924, ఫిబ్రవరి 21న ముగాబే బ్రిటిష్ పాలనలోని రొడీషియా(ప్రస్తుత జింబాబ్వే)లో జన్మించారు.

దక్షిణాఫ్రికాలోని ఫోర్ట్ హార్ విశ్వవిద్యాలయం నుంచి స్కాలర్ షిప్ అందుకున్నారు.  అనంతరం ఘనాలో ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు.  1964లో జింబాబ్వే ప్రధాని ఇయాన్ స్మిత్, ఆయన ప్రభుత్వాన్ని ‘కౌబాయ్’ లుగా అభివర్ణించడంతో ముగాబేను అరెస్ట్ చేసిన ప్రభుత్వం విచారణ జరపకుండానే పదేళ్లు జైలులో పెట్టింది.

1973లో విడుదలైన ఆయన మొజాంబిక్ కు వెళ్లిపోయారు. అక్కడి   1980లో ఎన్నికలు జరగ్గా ముగాబే ప్రధానిగా ఎన్నికయ్యారు. 1987లో ప్రధాని పదవిని రద్దుచేసి అధ్యక్ష పదవిని తనవద్దే అట్టిపెట్టుకున్నారు.

జింబాబ్వేలో ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగినా, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. జింబాంబ్వే ప్రజలు ఆకలితో అల్లాడిపోయేవారు. చివరికి ముగాబే పాలనతో విసుగు చెందిన ఆర్మీ ఆయనపై తిరుగుబాటు చేసింది. 2017లో గృహనిర్బంధంలో ఉంచింది. దీంతో జానూ పార్టీ ఉపాధ్యక్షుడు మనంగ్వా జింబాంబ్వే అధ్యక్షుడయ్యాడు.

Leave a Reply