జగన్ టీమ్ రెడీ – ఐఏఎస్ ల బదిలీలు

మే 30 న ఏర్పడే జగన్ టీం లో కొత్త మార్పులు జరగనున్నాయి… ఇప్పటివరకు కూడా చంద్రబాబు కి సన్నిహితులుగా ఉన్నటువంటి కొందరు అధికారులకు వారి పోస్టుల నుండి తప్పించి, జగన్ టీం కు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను కొన్ని కీలకమైంటువంటి స్థానాల్లో నియమించనున్నారు. ఈమేరకు ఇప్పటికే కొందరు పెద్ద అధికారులతో జగన్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా ఈ విషయం మీద సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో చర్చలు జరిగినట్లు, వాటికి అందరు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొందరు ఐఏఎస్ అధికారులకు బదిలీలు జరగనున్నాయి… రిటైర్డ్‌ సీఎస్ అజయ్ కల్లాంరెడ్డి, ఐవీఆర్ కృష్ణారావు సేవలను జగన్ మళ్ళీ ఉపయోగించుకోనున్నాడని సమాచారం. అంతేకాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పీవీ రమేష్ ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చారు. కాగా మరికొన్ని రోజుల్లో రిటైర్ కానున్న ఈ అధికారికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని జగన్ వర్గాలు ఎలుపుతున్నాయి.

ఇప్పటివరకు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు అధికారులు ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు, సీఎంవోలో పనిచేస్తున్న జీఏడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీకాంత్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజమౌళి, సాయి ప్రసాద్, స్పెషల్ సెక్రెటరీ టూ సీఎం సతీష్ చంద్ర, స్పెషల్ సెక్రెటరీ టూ సీఎం గిరిజా శంకర్, సీఆర్డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రెటరీ ముద్దాడ రవిచంద్ర, ఏపీఎడీసీ ఎండీ వెంకయ్య చౌదరి, ఎనర్జీ అండ్ సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్, సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్, ఏపీపీఎఫ్ఎస్ఎస్ సీఈవో క్రిష్ణదేవరాయలు, ఐ అండ్‌ పీఆర్ కమిషనర్‌ వెంకటేశ్వర్లు వున్నారు. వీరిలో క్రిష్ణమోహన్ రిటైర్డ్‌ అధికారి. వాసిరెడ్డి క్రిష్ణదేవరాయలు బయటి వ్యక్తి కాబట్టి ఈయనకు పూర్తిగా ఉద్వాసన పలుకనున్నారు.

కాగా మిగిలిన వారందరికీ కూడా బదిలీలు తప్పనిసరి ఉంటుంది. ఎక్కువ కాలం పదవిలో ఉన్నవారికి కూడా కొన్ని శాఖల్లో మార్పులు చేయనున్నారు. కాగా ఇప్పటివరకు సీనియర్లుగా చలామణి అవుతున్న అధికారులందరుకూడా ఇప్పటినుండి తమ పదవుల్లో కీలకంగా మారనున్నారని సమాచారం. అయితే ఇప్పటివరకు కీలక పోస్టులైన ఫైనాన్స్, జీఏడీ, సీఎంవో, జలవనరులశాఖ, మున్సిపాలిటీ శాఖ, సీసీఎల్ఏ, రెవిన్యూ, హెల్త్, పరిశ్రమల శాఖలకు తన తండ్రి వైఎస్ఆర్‌ హయాంలో తనతో సన్నిహితంగా మెలిగినవారిని తీసుకోనున్నారు. అంతేకాక ముఖ్యమైన శాఖల్లో ఏ వివాదాలులేని, సిన్సియర్ అధికారులకు కూడా చోటు ఇవ్వనున్నారు.

Leave a Reply